వాషింగ్టన్, జూలై 2 : రష్యాకు రక్షణ సాంకేతికతను, యంత్ర పరికరాలను సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో గతంలో నాలుగు భారత కంపెనీలపై విధించిన ఆంక్షలను అమెరికా తాజాగా తొలగించింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఆరఆర్‌జీ ఇంజనీరింగ్ టెక్నాలజీస్, లోకేశ్ మెషీన్స్ సంస్థలు కూడా ఉన్నాయి. వీటితోపాటు అహ్మదాబాద్‌కు చెందిన గేలక్సీ బేరింగ్స్, దిల్లీకి చెందిన శౌర్య ఏరోనాటిక్స్ కంపెనీలపై ఆంక్షలను అమెరికా తొలగించింది. యుద్ధ పరికరాల తయారీకి వాడే మైక్రోఎలక్టానిక్స్ పరికరాలను రష్యాకు చెందిన ఆర్టెంక్స్ కంపెనీకి సరఫరా చేసిందని ఆరఆర్‌జీ ఇంజనీరింగ్ టెక్నాలజీస్‌పై, రక్షణ పరికరాల తయారీకి అవసరమైన యంత్రాలను సరఫరా చేసిందని లోకేశ్ మెషీన్స్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇక, ఆయుధాల తయారీలో ఉపయోగించే రోలర్ బేరింగ్‌లను రష్యాకు సరఫరా చేస్తున్నారని గేలక్సీ బేరింగ్స్‌పై, రాడార్, నావిగేషన్ పరికరాలను విక్రయిస్తున్నారని శౌర్య ఏరోనాటిక్స్‌పై ఆంక్షలు విధించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



