ప్రేమ తెరలు-రేడియమ్

కలువ పూల కొలను చుట్టు
గరిక పెరిగె తడికి వడిగ
ప్రేమ పిలుపు రాక పాయె
కలువ క్రుంగె తేటి కొరకు

భముల దారి రేడు లేడు
నభము మురిసె మెరుపు రుచికి
వెల్గు ప్రేమ ముడులు రగిలె
విరహ జ్వాల జ్వలిత  వ్యధకు

ప్రేమ అలలు తరిగె పెరిగె
తటిని తాకి తిరిగి తరలె
నదికి మదికి స్పందన ఒకటె
చేర లేక పరుగు పెట్టె

మెరుపు చూపు మేను తాకె
ప్రేమ తేటి పరుగ తీసె
కలువ కొలను రంగు మారె
రాగ తాళ మయము  నభము

నిసిని చీల్చె వెలుగు రేఖ
రేడు రాక ప్రేమ ఫలము
ప్రకృతి తడిసె ప్రేమ మురిసె
జగమె శాంతి కాంతి కోరె

ప్రేమ లేని మనిషి లేడు
పక్షి లేదు  మృగము లేదు
ప్రేమ పెంచు  ప్రేమ పంచు
బతుకు పండు వెలుగు నిండు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *