ఫ్యూచర్ సిటీ భూములకు రికార్డు ధరలు

– రావిర్యాలలో చదరపు గజం భూమి రూ.83,500లు
– విక్రయాల ద్వారా రూ 140 కోట్లు ఆదాయం
– హౌసింగ్ బోర్డు స్థలాలకు భారీ డిమాండ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : రాజధాని క్యూర్ పరిధిలో పెద్దపెద్ద వెంచర్లు చేపట్టడానికి అనువుగా ఉన్న భూములకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. అందులోనూ ఎలాంటి వివాదాలు లేకుండా క్లియర్ టైటిల్‌తో ప్రభుత్వానికి చెందిన హౌసింగ్ బోర్డు స్థలాలకు డిమాండ్ మరింత భారీగా ఉంటోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఫ్యూచర్ సిటీ ఎంట్రన్స్‌లో ఎయిర్‌పోర్టుకు సమీపంలోని రావిర్యాలలో భూములను కొనుగోలు చేయడానికి అనేకమంది పోటీపడ్డారు. ఈ ప్రాంతలో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు గురువారం ఇ-వేలం నిర్వహించారు. మొత్తం నాలుగు భూమలకు నిర్వహించిన వేలంపాటలో చదరపు గజం భూమి గరిష్టంగా రూ.83,500కు అమ్ముడుపోయిందని హౌసింగ్ బోర్డు వైస్ చైౖర్మన్ వి.పి.గౌతం తెలిపారు. వెయ్యినుంచి 13,500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు లాండ్ పార్సిళ్లకు నిర్వహించిన వేలం పాట ద్వారా సుమారు రూ.140 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ భూములను ఇ-ఆక్షన్‌లో విక్రయిస్తున్నట్లు గత నెలలో హోసింగ్ బోర్డు ప్రకటన ఇచ్చింది. ఈ భూములను కొనుగోలు చేయడానికి సుమారు 17 సంస్థలు పోటీ పడ్డాయి. ఇందులో 1113 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భూమిని కొనుగోలు చేయడానికి బిడ్డర్లు పోటీ పడ్డారు. రూ.26 వేల కనీస ధరను నిర్ధారించగా దీనిని దక్కించుకోడానికి పోటీపడుతూ చదరపు గజం రూ.83,500కు ఒక డెవలపర్ సంస్థ దక్కించుకుంది. అలాగే ఇదే ప్రాంతంలోని సుమారు ఆరు వేల చదరపు గజాల విస్తీర్ణంలోని భూమి వేలం పాటలో చదరపు గజం రూ.62,500 ధరకు అమ్ముడుపోయింది. అంతేకాక సుమారు 13,500 చదరపు గజాల విస్తీర్ణంలోని భూమిని కొనుగోలు చేయడానికి కూడా బిడ్డర్లు పోటీ పడ్డారు. ఈ నాలుగు భూముల వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.140 కోట్ల మేర ఆదాయం వచ్చింది.

రేపు కూడా భూముల విక్రయాలు

కేపీహెచ్‌బి కాలనీ, కుత్భుల్లాపూర్ చింతల్ ప్రాంతాల్లోని మరో నాలుగు ప్లాట్లకు (భూములకు) శుక్రవారం ఇ-ఆక్షన్ నిర్హహిస్తున్నారు. కేపీహెచ్‌బి కాలనీ ఫేజ్ 1-2లోని 5,898 చదరపు గజాలు, 2,420 చదరపు గజాల్లోని ప్లాట్ నెం 2, కుత్బుల్లాపూర్ చింతల్‌లోని 10,890 చదరపు గజాలు, 3,388 చదరపు గజాల భూములను వేలం ద్వారా విక్రయించనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *