– రెండు రోజుల్లో రుతుపవనాల ఆగమనం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఓ చల్లని కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని వెల్లడించింది. ఈ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడటమే కాకుండా రాగల మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా విస్తరించడానికి ముందు రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. అందువల్ల రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం వేళల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





