ఉద్యమకారుల గుర్తింపా? అగౌరవమా? చరిత్ర తారుమారా?

“తెలంగాణ ఉద్యమం ఎంత విస్తారమైనదంటే జనాభాలో సగం, కనీసం మూడో వంతు అయినా ఆ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. అంటే కనీస పక్షం ఒక కోటి మంది ఉద్యమకారులు తేలుతారు. అంత భారీ సంఖ్య మొత్తాన్నీ ఎట్లా గుర్తిస్తారు? ఏ సత్కారంతో గౌరవిస్తారు? కనీస నగదు పారితోషికం ఇవ్వాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలి? ఉద్యమ క్రమంలో ప్రాణాలు బలిపెట్టిన 1400 అనే చిన్న సంఖ్యనే పన్నెండు సంవత్సరాలుగా, అధికారిక గణాంకాల అరణ్యంలో కచ్చితంగా తేల్చలేకపోయిన, ఒక సమగ్ర జాబితా తయారు చేయలేకపోయిన ప్రభుత్వాలు, పాలకవర్గాలు ఈ ఉద్యమకారుల సంపూర్ణ జాబితా తయారీకి సహకరిస్తాయా?”

ఇటువంటి అత్యవవసరమైన ప్రక్రియ అలా అసంతృప్తిగా మిగలడానికి చాలా చారిత్రకమైన, తాత్వికమైన, సాంస్కృతికమైన, దీర్ఘకాలిక, తక్షణ కారణాలున్నాయి. ఈ ప్రక్రియ సక్రమంగా సాగకుండా అడ్డుకునే సాంకేతిక సమస్యలున్నాయి. కొన్నిటినైనా ఇక్కడ చర్చించాలి:

ఒకటి, ఒక విస్తృత ప్రజా ఉద్యమాన్ని అందులో పాల్గొన్నవారి గుర్తింపుతో, అలా గుర్తించినవారికి గౌరవ పురస్కారాలతో, నగదు బహుమతులతో కొలవడం సాధ్యం కాదు. బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్ర్య సమర యోధులను అలా గుర్తించి ప్రతి ఒక్కరికీ ఒక తామ్రపత్రమూ, నెలవారీ పెన్షనూ ఏర్పాటు చేయాలని స్వాతంత్ర్య రజతోత్సవాల సందర్భంగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పుల తడకగా మిగిలింది. వందలాదో, వేలాదో అబద్ధపు “స్వాతంత్ర్య సమరయోధులను” పుట్టించిన కుంభకోణంగా మారింది. స్వాతంత్ర్య సమరం నాటికి పుట్టి ఉండని, లేదా అప్పటికి శిశువులుగా ఉండినవారు ఉద్యమంలో పాల్గొన్నట్టూ, జైళ్లలో ఉన్నట్టూ, పోలీసు కేసుల్లో ఇరుక్కున్నట్టూ దొంగ పత్రాలు తయారుచేసి, సంపాదించి మొత్తంగా పథకమే నవ్వుల పాలయ్యింది. పోలీసు రికార్డో, ఉద్యమ నాయకుల ధృవీకరణ పత్రమో ప్రాతిపదికగా పెట్టుకుంటే ఇటువంటి అవినీతీ అక్రమమూ తప్పవు.     

రెండు, నిజానికి ఒక ప్రజా ఉద్యమంలో పాల్గొనేవారు, ఆ ఉద్యమం విజయం సాధిస్తే తమకు వ్యక్తిగతంగా ఒనగూరబోయే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాల్గొనరు. తమ ఆశయాల కోసం, తమ త్యాగం ద్వారా ఒక ఉజ్వల భవిష్యత్తు వికసిస్తుందనే ఆదర్శంతో పాల్గొంటారు. వలస వ్యతిరేక ఉద్యమ కాలానికీ, ప్రస్తుతానికీ మనుషుల విలువల చట్రాల్లో మార్పు వచ్చిన మాట నిజమే గాని, ఇప్పటికీ కొందరైనా ఆదర్శాల కోసమే ఉద్యమంలో పాల్గొని మరణాన్ని, హింసను, నిర్బంధాన్ని, ఇబ్బందులను స్వీకరించి ఉంటారు. నగదు బహుమానం రూపంలో పరిహారం వారికి అవమానమే అవుతుంది.   

మూడు, ఈ ప్రక్రియ కోసం నియమించిన కమిటీ ప్రాతినిధ్య స్వభావం కలిగినది కాదని, ముస్లింలకు, స్త్రీలకు ప్రాతినిధ్యం లేకపోవడం మీద విమర్శలు కూడా వచ్చాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం విస్తారమైనది. సబ్బండవర్ణాల ప్రజలు పాల్గొన్నది. ఆ బహుళ ఉద్యమాన్ని ఇవాళ్టి రాజకీయ సంకుచితత్వంతో, పార్టీ ప్రయోజనాలకు లోబడి గుర్తించడం అసాధ్యం. కనీసం, ఉద్యమకారులను గుర్తించడానికి ఏర్పాటయ్యే బృందం నిష్పాక్షికంగా, సకల వర్గాల భాగస్వామ్యాన్ని సగౌరవంగా గుర్తించేదిగా ఉండాలి. ఉద్యమంలో తరతమ స్థాయిల్లో పాల్గొన్నవారు కమిటీలో ఉండవచ్చు. కాని వారు పక్షపాతానికి లోనుకాకుండా, సంయమనంతో అన్ని వర్గాల భాగస్వాములను అంగీకరిచగలరా అనుమానమే. అలాగే ఉద్యమంలో భాగస్వాములుగా ఉండిన వర్గాల నుంచి, ముఖ్యంగా విద్యార్థులు,  నిరుద్యోగులు,  ఉద్యోగులు, మహిళలు,  ముస్లింలు,  ఆదివాసులు,  కళాకారులు,  రచయితలు,  జర్నలిస్టులు, న్యాయవాదులు వంటి అనేక బృందాల ప్రాతినిధ్యం లేకపోవడం వారికి సముచిత గుర్తింపు దక్కుతుందా అనే అనుమానాన్ని మిగులుస్తుంది. కమిటీలో ప్రాతినిధ్యం ఉన్నా లేకపోయినా,  గుర్తింపు ప్రక్రియ కచ్చితంగా నిష్పాక్షికంగా అన్ని రాజకీయ స్రవంతులను, అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.   

“ఉద్యమకారుల గుర్తింపు, వారిని తలచుకోవడంలో, వారి త్యాగం వల్లనే మనం ఈ స్థితిలో ఉన్నామనే గౌరవభావనలో ఉంటుంది గాని, వారి పేరు మీద నగదు పరిహారం అందజేయడంలో, అందుకోసం స్వార్థ ప్రయోజనాలు రేకెత్తించడంలో, సకల అక్రమాలకు పుట్టినిల్లు కావడంలో ఉండదు. ఆ అక్రమాలు వారి కృషి పట్ల అగౌరవంగా మిగిలిపోతాయి.”

నాలుగు, తెలంగాణ ఉద్యమం 1952 ముల్కీ ఉద్యమం నుంచి 2014 విజయం దాకా అనేక మలుపులు చూసింది. ప్రస్తుత ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో ఏ దశను ప్రాతిపదికగా తీసుకుంటున్నారనే దానిపై స్పష్టత లేదు. మలిదశ ఉద్యమాన్నే పరిగణిస్తున్నారనడానికే ఎక్కువ సూచనలున్నాయి. 1952 ముల్కీ ఆందోళన, ఫజలలీ కమిషన్, పెద్దమనుషుల ఒప్పందం, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వంటి సందర్భాలకు కాలం చెల్లిందని అనుకున్నా, 1969 ఉద్యమాన్ని, 1995 నుంచి ప్రారంభమయిన కదలికలను. 2001, 2009 మైలురాళ్లను తప్పనిసరిగా గుర్తించాలి. కమిటీ ఏమి ఆలోచిస్తున్నదో, ఏమి ఆలోచించాలని ప్రభుత్వం ఆదేశించిందో తెలియదు.

ఐదు, గుర్తింపు ప్రక్రియ సన్నాహకాలన్నీ సక్రమంగా జరిగినా, గుర్తింపులో మిగిలిపోయే సమస్యలున్నాయి. ఒకేఒక్క ప్రదర్శనలో పాల్గొని, లాఠీచార్జిలో దెబ్బలు తిన్న, అరెస్టయిన, కేసులో నమోదైన, కొద్ది రోజులపాటు జైలులో ఉన్న ఒక వ్యక్తి ఉద్యమకారుడిగా గుర్తింపు పొంది, మూడు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో పని చేస్తూ, గ్రామీణ స్థాయి ప్రజలను కూడగడుతూ, ఉద్యమకాలంలో డజన్లకొద్దీ ప్రదర్శనలు నిర్వహించిన వ్యక్తి ఎక్కడా పోలీసు రికార్డులో లేకపోవడం వల్ల ఉద్యమకారుడి గుర్తింపు పొందకపోవచ్చు. అసలు ఉద్యమకారుల గుర్తింపుకు ప్రాతిపదిక ఏమిటి, ఎటువంటి సాక్ష్యాధారాలను కమిటీ గుర్తిస్తుంది వంటి ప్రశ్నలకు నిర్దిష్టమైన, వివాదరహితమైన, సర్వజనామోదమైన ప్రాతిపదికలు తయారుచేయాలి.  

ఆరు, కమిటీ చాలా కృషి చేసి, ఒక వివాదరహితమైన, కచ్చితమైన, సంపూర్ణమైన జాబితా తయారుచేయగలదనే అనుకుందాం. తెలంగాణ ఉద్యమం ఎంత విస్తారమైనదంటే జనాభాలో సగం, కనీసం మూడో వంతు అయినా ఆ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. అంటే కనీస పక్షం ఒక కోటి మంది ఉద్యమకారులు తేలుతారు. అంత భారీ సంఖ్య మొత్తాన్నీ ఎట్లా గుర్తిస్తారు? ఏ సత్కారంతో గౌరవిస్తారు? కనీస నగదు పారితోషికం ఇవ్వాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలి? ఉద్యమ క్రమంలో ప్రాణాలు బలిపెట్టిన 1400 అనే చిన్న సంఖ్యనే పన్నెండు సంవత్సరాలుగా, అధికారిక గణాంకాల అరణ్యంలో కచ్చితంగా తేల్చలేకపోయిన, ఒక సమగ్ర జాబితా తయారు చేయలేకపోయిన ప్రభుత్వాలు, పాలకవర్గాలు ఈ ఉద్యమకారుల సంపూర్ణ జాబితా తయారీకి సహకరిస్తాయా?

ఏడు, పైన చెప్పిన సాంకేతిక, తక్షణ సమస్యలతోపాటు లోతైన తాత్విక, రాజకీయార్థిక, చారిత్రక సమస్యలు కూడా ఉన్నాయి. ఉద్యమకారుల గుర్తింపు అంటే ఉద్యమ చరిత్ర నిర్వచనంతో, ఉద్యమ చరిత్ర రచనతో సమానమైన పని. ఆ పని చేయడానికి ఒక ప్రభుత్వానికో, ప్రభుత్వం వేసిన కమిటీకో అర్హత ఉంటుందా? ఎన్ని సదుద్దేశాలున్నప్పటికీ, ఒక ప్రభుత్వ నియమిత కమిటీ, చరిత్రను నిర్వచించగలదా? చరిత్ర రచన చేయగలదా? మన సమకాలీన చరిత్రలోని వివాదాస్పద అంశాలను, భిన్నాభిప్రాయాలను పరిష్కరించగలదా? భిన్న భావజాలాల వ్యక్తుల భాగస్వామ్యాన్ని, ఉన్నది ఉన్నట్టుగా గుర్తించగలదా?

ఎనిమిది, ఉద్యమ ఫలాలు అందరికీ పంచాలనేది సదాశయమే, అందుకోసం ఉద్యమకారులను గుర్తించవలసి ఉందనేది నిజమే. కాని ఆ క్రమం పాలనాపరమైన చర్యనా, చరిత్ర రచనా ప్రక్రియనా? పాలనాపరమైన చర్య తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారమూ ఉంది, బాధ్యతా ఉంది. కాని చరిత్ర రచన ప్రభుత్వానికో, ప్రభుత్వాధీనంలోని కమిటీకో అప్పగించగల చర్య కాదు. అలా అప్పగిస్తే, అసలు ఉద్యమ చరిత్రనే అధికారికంగా, పై నుంచి రాసే కృషిగా, కొందరి చరిత్రగా మారుతుంది. అప్పుడు తప్పనిసరిగా పాక్షిక చరిత్రే మిగులుతుంది. ప్రపంచ వ్యాప్తంగా గెలిచిన ప్రజాఉద్యమాలలో, అధికారం చేజిక్కించుకున్న ఒక సెక్షన్ మొత్తం ప్రజా ఉద్యమం తనది మాత్రమే అన్నట్టు, మిగిలిన సెక్షన్ల చరిత్రను తుడిచివేసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుత ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ ఆ అధికార చరిత్ర రచనకు, అధికార చరిత్ర విస్మరణకు దారి తీస్తుందా?  

తొమ్మిది, తెలంగాణాను, తెలంగాణ ఆకాంక్షలను తొక్కిపెట్టి, “అధికారిక” చరిత్రను, కథనాన్ని సృష్టించారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులను ఎంతోకాలంగా విమర్శించినవారిమే, మళ్లీ అటువంటి “అధికారిక” చరిత్రనే నిర్మించే ప్రక్రియను మొదలు పెడుతున్నామా? ఇందులో విస్మరణకూ, అణచివేతకూ గురైన, గురవుతున్న, గురి కాబోతున్న వ్యక్తులూ, సంస్థలూ, ప్రయోజనాలూ ఏవి? ఎందువల్ల?

మొత్తంగా ఒక ఉద్యమంలో కష్టనష్టాలు అనుభవించినవారికి వ్యక్తిగత ప్రయోజనాలు, పరిహారాలు ఇవ్వాలనే ఆలోచన మంచిదే కావచ్చు. కాని, అంతకన్నా వారు అనుభవించిన కష్ట నష్టాలను భావితరాలకు తెలియజెప్పే కృషి అవసరమైనది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఆరేడు దశాబ్దాల కింద నిష్పాక్షికంగా సంకలనం చేసిన హూ ఈస్ హూ ఆఫ్ మార్టీర్స్ ఆఫ్ ఫ్రీడం స్ట్రగుల్ ఇన్ ఇండియా గాని, మొదట హైదరాబాద్ ప్రభుత్వం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన నాలుగు, నాలుగు సంపుటాల ఫ్రీడం స్ట్రగుల్ ఇన్ హైదరాబాద్’, ‘ఫ్రీడం స్ట్రగుల్ ఇన్ ఆంధ్రా’ వంటి కృషి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఇప్పటికైనా జరగాలి. ఉద్యమకారుల గుర్తింపు, వారిని తలచుకోవడంలో, వారి త్యాగం వల్లనే మనం ఈ స్థితిలో ఉన్నామనే గౌరవభావనలో ఉంటుంది గాని, వారి పేరు మీద నగదు పరిహారం అందజేయడంలో, అందుకోసం స్వార్థ ప్రయోజనాలు రేకెత్తించడంలో, సకల అక్రమాలకు పుట్టినిల్లు కావడంలో ఉండదు. ఆ అక్రమాలు వారి కృషి పట్ల అగౌరవంగా మిగిలిపోతాయి.

“నిజానికి ఒక ప్రజా ఉద్యమంలో పాల్గొనేవారు, ఆ ఉద్యమం విజయం సాధిస్తే తమకు వ్యక్తిగతంగా ఒనగూరబోయే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాల్గొనరు. తమ ఆశయాల కోసం, తమ త్యాగం ద్వారా ఒక ఉజ్వల భవిష్యత్తు వికసిస్తుందనే ఆదర్శంతో పాల్గొంటారు. వలస వ్యతిరేక ఉద్యమ కాలానికీ, ప్రస్తుతానికీ మనుషుల విలువల చట్రాల్లో మార్పు వచ్చిన మాట నిజమే గాని, ఇప్పటికీ కొందరైనా ఆదర్శాల కోసమే ఉద్యమంలో పాల్గొని మరణాన్ని, హింసను, నిర్బంధాన్ని, ఇబ్బందులను స్వీకరించి ఉంటారు. నగదు బహుమానం రూపంలో పరిహారం వారికి అవమానమే అవుతుంది.”

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పన్నెండు సంవత్సరాలకు ఎట్టకేలకు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నతాధికార కమిటీని నియమించింది. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు అధ్యక్షతన, మంత్రి పొన్నం ప్రభాకర్, శాసనమండలి సభ్యులు ఎం కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ శాసనమండలి సభ్యులు రాములు నాయక్, కాంగ్రెస్ నాయకులు మోతె శోభన్ రెడ్డి సభ్యులుగా ఏర్పాటయిన ఈ కమిటీకి సాధారణ పరిపాలనా శాఖ (రాజకీయ) కార్యదర్శి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. రెండున్నర నెలల కింద, మే 15న ఒక ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా నియామకం జరిగిన కమిటీకి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, ఉద్యమకారుల, అమరవీరుల ధృవీకృత జాబితా తయారు చేయడం, గుర్తించిన ఉద్యమకారులకు పురస్కారాలు, గౌరవాలు, తగిన గౌరవ సదుపాయాలు సూచించడం, ఏయే వర్గాల, సమూహాల ఉద్యమకారులను గుర్తించాలో నిర్ణయించడం వంటి బాధ్యతలు ఉన్నాయి.

ఈ కమిటీ మొదటి సమావేశంలో, ఉద్యమంలో అమరులైనవారి పేర్లను గుర్తించాలని, ఉద్యమంలో గాయపడిన, శాశ్వతంగా అంగవైకల్యానికి గురైనవారిని గుర్తించాలని, ఉద్యమ కాలంలో క్రిమినల్ కేసుల్లో ఇరికించబడినవారిని, జైలు నిర్బంధానికి గురైనవారిని గుర్తించాలని, అట్టడుగు స్థాయిలో ఉద్యమాన్ని నిర్మించిన, నిర్వహించిన వారిని గుర్తించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో తమకు సహకరించవలసిందిగా కమిటీ బహిరంగ ప్రకటనలు చేసింది. హైదరాబాదు లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ కూడా ఉద్యమకారులతో సమావేశాలు నిర్వహిస్తామనీ, సంప్రదింపులు జరుపుతామనీ కమిటీ ప్రకటించింది.

ఈ రెండున్నర నెలల్లో ఎన్నో ఉద్యమ సంస్థలు, వ్యక్తులు ఈ కమిటీ ముందు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు. అమరవీరుల కుటుంబ సభ్యులు, ఉద్యమకాలంలో అనేక వర్గాల్లో, సమూహాల్లో పుట్టుకొచ్చిన జాయింట్ ఆక్షన్ కమిటీలు (జెఏసిలు), ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, ఉపాధ్యాయ, మహిళా, సాంస్కృతిక, రచయితల, న్యాయవాదుల, కళాకారుల, రాజకీయ సంస్థల ప్రతినిధులు, ప్రవాస తెలంగాణ బృందాలు ఈ సంప్రదింపులకు హాజరయ్యారు. 1969 నాటి ఉద్యమకారులు కూడా ఈ సమావేశాలకు హాజరై తమను కూడా ఈ గుర్తింపు ప్రక్రియలో భాగం చెయ్యమని కోరారు. 

ఈ ప్రక్రియ అంతిమ పర్యవసానం ఎలా ఉండబోతుందో ఇప్పటికి స్పష్టం కాలేదు గాని, గత ఎనిమిది పది వారాల ప్రక్రియలో కనీసం మరొకసారి తెలంగాణ ప్రత్యేక అస్తిత్వపు ఆకాంక్షల గురించి, ఆ ఆకాంక్షల సాధన కోసం తెలంగాణ ప్రజానీకంలో గణనీయమైన భాగం చేసిన అపురూపమైన పోరాటం గురించి, చేసిన అపారమైన త్యాగాల గురించి చర్చ జరిగే అవకాశం వచ్చింది. సమగ్రంగానైనా కాకపోయినా గత ఉజ్వల చారిత్రక అనుభవాలను మరొకసారి మననం చేసుకునే అవకాశం రావడం దానికదే అద్భుతమైనది. ఉద్యమంలో పాల్గొన్నవారిలో చాలా మంది ఇప్పుడు లేరు. ఉన్నా నిర్లిప్తతలో, మౌనంలో, ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ఔదాసీన్యంలో ఉన్నారు. ఉద్యమకాలంలో ఉండిన సంస్థల్లో కొన్ని ఇప్పుడు లేవు, రద్దయ్యాయి, ముక్కలయ్యాయి, భిన్న మార్గాల్లోకి జారిపోయాయి. అందువల్ల కమిటీకి అందుతున్న ప్రాతినిధ్యాల్లో ఎంతో కొంత కొరత తప్పదు. అయితే, కమిటీ గాని, ప్రభుత్వం గాని ఎంతవరకు గుర్తించారో తెలియదు గాని, వారు తలకెత్తుకున్న ప్రక్రియ చాలా సంక్లిష్టమైనది, కష్టభూయిష్టమైనది, లోపరహితంగా, వివాదరహితంగా నిర్వహించడం అసాధ్యమైనది. చిట్టచివరికి తప్పుల తడకగా, అసంతృప్తిమయంగా, అరకొరగా మిగలక తప్పనిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *