పొనికి పున‌రుత్ప‌త్తి ప‌రిశోధ‌న‌లు స‌క్సెస్‌

– నిర్మ‌ల్ బొమ్మ‌ల త‌యారీలో ఈ క‌ల‌పే కీల‌కం
– అంత‌రించిపోయే ద‌శ‌లో పొనికి చెట్లు
– వీటి పున‌రుద్ధ‌ర‌ణ‌కు ములుగు ఎఫ్ సీఆర్ఐ య‌త్నాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన నిర్మల్‌ బొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి చెట్టు అత్యంత అరుదైన వృక్ష జాతి. దీని శాస్త్రీయ నామం గీవోటియా రొట్లేరిఫార్మీస్‌. ఈ జాతి వృక్షం నిరాదరణకు గురికావడం, పేలవమైన పునరుత్పత్తి, విత్తన నాణ్యత లోపించడం, సరైన భూసారం లేకపోవడంతో అంతరించే చెట్ల జాబితాలో చేరింది. అయితే ములుగులోని అటవీ కళాశాల రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌సీఆర్‌ఐ) ఈ పొనికి చెట్ల విత్తనాల అంకురోత్పత్తి, చెట్ల పునరుత్పత్తిలో గణనీయమైన విజయాన్ని సాధించింది. ట్రీ బ్రీడిరగ్‌, ఇంప్రూవ్‌మెంట్‌ విభాగానికి చెందిన ఎమ్మెస్సీ రీసెర్చ్‌ స్కాలర్‌ మాలోతు మౌనిక ఈ విజయాన్ని సాధించింది. మృదువుగాను, తేలికగా ఉండే ఈ చెట్టు కలపతో నిర్మల్‌ బొమ్మలు, సంప్రదాయ కళాఖండాలు తయారు చేస్తారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రీజా సుందరం గైడెన్స్‌లో చేపట్టిన ఈ పొనికి విత్తనాల జెర్మినేషన్‌ రేటు 80 శాతం వరకు వచ్చేలా విజయం సాధించారు. వీరు ఇటీవల చేపట్టిన ఈ సీడ్‌ జెర్మినేషన్‌ ప్రొటోకాల్‌కు పేటెంట్‌ పొందేందుకు ప్రతిపాదనలు పంపామని ములుగు అటవీ కళాశాల డీన్‌ వి.కృష్ణ వెల్లడిరచారు. అటవీ ఆధారిత పరిశ్రమలు, సామాజిక ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడే పొనికి వృక్ష జాతి పునరుద్దరణకు తమ కళాశాల పరిశోధకులు చేపట్టిన ఈ సీడ్‌ జెర్మినేషన్‌ విజయవంతం కావడం ఒక చారిత్రక అంశమని అన్నారు. ఈ పరిశోధన పెద్ద ఎత్తున పొనికి చెట్ల పెంపకం చేపట్టేందుకే కాక పర్యావరణ పరిరక్షణ, హస్తకళల ఆధారిత ఆర్థిక పురోగతికి దోహదపడుతోందన్నారు. పొనికి మొక్కల పెంపకానికి విత్తనాలను అటవీ శాఖకు అందచేయడం ద్వారా అంతరించిపోతున్న ఈ చెట్ల అభివృద్ధికి, తద్వారా నిర్మల్‌ హస్తకళల పరిశ్రమకు ములుగు అటవీ కళాశాల, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సరికొత్త మార్గం చూపించిందని ప్రిన్సిపాల్‌ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page