కొత్తగా 200 జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు

– అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
– హనుమకొండకు 7, వరంగల్ కు 5 మంజూరు

హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: న్యాయవ్యవస్థను మరింత బలోపే తం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా న్యాయవ్యవస్థ పరిధిలో 200 కొత్త అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి-కమ్-అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుల ఏర్పాటుకు ప్రభు త్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయ శాఖ జీవో ఎం ఎస్ నెం.59. తేదీ 24-09-2026ను జారీ చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) రాష్ట్రం లో 594 కొత్త కోర్టుల ఏర్పాటుకు అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాలు, పునరావృత-పునరావృతేతర వ్యయాలకు బడ్జెట్ సహా అనుమతి కోరగా ప్రభుత్వం పరిశీలన అనంతరం తొలి విడతలో 200 కోర్టులకు అనుమతి ఇచ్చింది. సిబ్బంది, ఇతర వ్యయాలకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు జీవోలో పేర్కొంది. తదుపరి చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ ను ప్రభుత్వం కోరింది. ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి కూడా ప్రాధాన్యం లభించింది. జీవోకు జత చేసిన జాబితా ప్రకారం హనుమకొండ జిల్లా పరిధిలో హనుమకొండలో 6. పరకాలలో ఒకటి కలిపి మొత్తం 7 కొత్త కోర్టులు మంజూరయ్యాయి. వరంగల్ జిల్లా పరిధిలో వరంగల్, హనుమకొండలో 4, నర్సం పేటలో ఒకటి కలిపి మొత్తం 5 కోర్టులు ఏర్పాటు కానున్నాయి. అదేవిధంగా జనగా మలో 2. స్టేషన్ ఘన్పూర్ లో ఒకటి, జయశంకర్ భూపాలపల్లిలో 2, ములుగులో ఒక కొత్త కోర్టును ప్రతిపాదిత జాబితాలో పొందుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 200 కోర్టుల కేటాయింపును అనుబంధ జాబితాలో ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త కోర్టుల ఏర్పాటు ద్వారా పెండింగ్ కేసుల పరిష్కారానికి అదనపు న్యాయస్థానాల సామర్థ్యం అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని జీవోలో పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *