డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లల్లో సోదాలు

– కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ
– బయటపడ్డ కట్టలకొద్దీ నోట్లు

హైదరాబాద్, సెప్టెంబర్ 24: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు అయిన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి బినామీలుగా అనుమానిస్తున్న ఎనిమిదిమంది ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, జహీరాబాద్ ప‌ది ప్రాంతాల్లో ఈ సోదాలు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. భీమ్‌రెడ్డితో ఆర్థిక, ఇతర లావాదేవీలు ఉన్నట్లు అనుమానిస్తున్న వారి ఇళ్ల నుంచి పలు కీలక పత్రాలు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బొమ్మ వెంకటేష్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేయగా రూ.1.35 కోట్ల అక్రమ నగదును గుర్తించామని వారు తెలిపారు. అంతేకాక భారీగా విదేశీ కరెన్సీని, సుమారు 14 లీటర్ల విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అక్రమ మద్యం విషయాన్ని ఎక్సైజ్ శాఖకు తెలియజేశామని, ఎక్సైజ్ చట్టాల ప్రకారం సంబంధిత పోలీసులు కేసు నమోదు చేస్తారని తెలిపారు. భీమ్ రెడ్డి డీజీపీ కార్యాలయంలోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో పనిచేశారు. తెలంగాణ, కర్ణాటక వ్యాప్తంగా 16 ప్రాంతాలలో జరిగిన సోదాలలో రూ.200 కోట్లకు పైగా విలువైన స్థిరాస్తులు, చరాస్తులు బయటపడటంతో జూలైలో ఆయనను అరెస్టు చేసి చంచగూడ జైలుకు తరలించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయనపై సెప్టెంబర్‌లో మనీలాండరింగ్ నిరోధక కేసు కూడా నమోదు చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *