– అయిన కాడికి వడ్లను అమ్ముకుంటున్న రైతులు
– దొడ్డు వడ్లు కొనే దిక్కే లేదు
– క్వింటాకు పది కిలోలు తరుగు
– లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి.. నష్టపరిహారం ఇవ్వాలి
– యాసంగి రైతుబంధు నిధులు విడుదల చేయాలి
– బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్
సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 17 : రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర నష్టపోతున్నారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. నిజాంపేట్ మండల కేంద్రంలో మంగళవారం రైతులను కలిసినప్పుడు ఇంతవరకు ఇక్కడ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయలేదని చెప్పారు. కొబ్బరి కాయలు కొట్టారు సరే గింజ కూడా కొనుగోలు చేయకపోవడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం కొనకపోవడంతో మరో దారి లేక రైతులు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారన్నారు. నల్గొండ , నిజామాబాద్ జిల్లాల నుండి ఫోన్ లు చేస్తున్నారు. రూ.2600కు మాత్రమే సన్న వడ్లు కొనుగోలు చేస్తున్నారు. నీ మాట నమ్మి సన్నాలు సాగు చేసినందుకు నష్టపోతున్నారని విమర్శించారు. అనేక జిల్లాలో రూ.2600, 2700లకే క్వింటాల్ అమ్ముతున్నారన్నారు. ఇక దొడ్డు వడ్లు కొనే దిక్కు లేదు, క్వింటాల్ కు పది కిలోలు తరుగు పెట్టడం దారుణమన్నారు. దీనితో రైతులు తివ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 20రోజుల నుండి అక్కడే వడ్లు పోసుకొని ఉంటున్నారు. మూడుసార్లు రైతు భరోసా ఎగ్గొడితివి. రైతుకు బోనస్ ఇవ్వడం లేదు.. రుణ మాఫీ చేయకపోతివి ప్రభుత్వం కొనపోవడంతో దళారులు దొడ్డు రకం వడ్లు 2200 క్వింటాల్ కొంటుండటం వల్ల రైతులు బాగా నష్టపోతున్నారన్నారు.
రైతుకు బోనస్ విషయంలో జీవో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లక్షల ఎకరాలు పంట ఎండింది.. ఇప్పటివరకు లెక్కలు తీయలేదు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రతి రైతుకు ఎకరాకు రూ.5వేలు సహాయం చేశారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాడు కేసీఆర్ పంటలు నష్టపోతే ఎకరాకు 10వేలు ఇచ్చారు. నువ్వు కూడా ఇవ్వాలి. యాసంగి రైతు బంధు డబ్బులు కూడా విడుదల చేయాలి. దొడ్డు వడ్లు కోతలు లేకుండా, తరుగు లేకుండా కొనుగోలు చేయాలి. మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు అని ఇక్కడ మెగ్యనాయక్ తండా వాసులు తెలిపారు. ప్రత్యామ్నాయం ఆలోచన చేయండి నీళ్ళు ఎత్తండి. నల్ల వాగులో నీళ్లు ఉన్నాయి నిజాం సాగర్ లో నీళ్ళు ఉన్నాయి నీళ్ళు నింపండి. ప్రజలకు త్రాగు నీళ్లు ఇవ్వండని డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ లో వలసలు పోతున్నారు.మహబూబ్ నగర్ నుండి వలసలు పోతున్నారు. ఇందిరా గాంధీ ఆత్మీయ బరోసా అని పేరు పెట్టీ ఆమెను కూడా గోస పెడుతున్నారు. ఇయ్యని పథకాలకు రాజీవ్, ఇందిరా గాంధీ పేర్లు పెట్టుడు ఎందుకు? ఇవ్వని పథకాలకు నీ పేరు పెట్టుకో. నువ్వో మోసగాడివి. నారాయణఖేడ్ లో రైతులు చనిపోయారు. వారికి రైతు బీమా రావడం లేదు. బీమా డబ్బులు కట్టక రైతు కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు.. నీ కొత్త బీమా వచ్చేది దేవుడు ఎరుగు ఉన్న బీమా అమలు చెయ్యి. కొత్త భీమా ఇంటికి ఒక్కరికే అంటున్నారు.. దీనివల్ల ఏం లాభం? ఇప్పటివరకు 3వేల మంది రైతులు చనిపోయారు వారికి ప్రభుత్వం ఆదుకోవాలి. త్రాగు నీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. వ్యవసాయ కూలీలకు 12వేలు ఇస్తానన్నావు. అన్నమాట ప్రకారం ఆ డబ్బులు విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నయవంచనకు మూడేళ్లు
గొప్పగా చెప్పుకున్న అభయహస్తం.. హామీలను అమలు చేయని మొండి హస్తంగా మారిందని హరీష్‌రావు అన్నారు. మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని, దానిని తూచా తప్పకుండా అమలు చేస్తామని మూడేళ్ల క్రితం ఇదే రోజు మల్లికార్జున ఖర్గే సమక్షంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మూడేళ్లు గడిచినా ఆ హామీలకు దిక్కులేదు. అమలు ఊసే లేదు. అభయ హస్తం.. శూన్య హస్తం అయ్యింది. ఓట్లు వేసిన ప్రజలనే కాదు.. ఒట్లు వేసి దేవుళ్లను, పవిత్ర గ్రంథాలను సైతం మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. గాంధీ భవన్ సాక్షిగా ప్రజలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదు? ఖర్గే, రేవంత్ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తొలి కేబినెట్లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ నీటిమూటగానే మిగిలింది. ఇప్పటివరకు 38 కేబినెట్ సమావేశాలు జరిగినా గ్యారెంటీలకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదు అని ప్రశ్నించారు. గాంధీ పేరు చెప్పుకుని రాజకీయాలు చేసే కాంగ్రెస్.. గాంధీభవన్ సాక్షిగా ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరి చూస్తే గాంధీ ఆత్మ కూడా క్షోభిస్తుంది. హామీలు అమలు చేయకుండా మూడేళ్లుగా ప్రజలను మభ్యపెట్టడమే కాంగ్రెస్ సాధించిన ఘనత. కాంగ్రెస్ మాయమాటలను, నయవంచనను ప్రజలు ఇప్పటికే గుర్తించారు. ఇక మిగిలింది తగిన గుణపాఠం చెప్పడమేనన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





