దడ పుట్టిస్తున్న వీధికుక్కలు

ప్రజల ప్రాణాలకు రక్షణ క‌రువు
ఏడేళ్ల బాలుడిపై ఐదు కుక్కల దాడి.. తీవ్ర గాయాలు!
న‌గ‌ర వ్యాప్తంగా శున‌కాల‌ బెడద
ఉన్నతాధికారులు పరిష్కారం చూపాలని ప్రజల డిమాండ్

హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : న‌గ‌రంలో వీధి కుక్క‌లు ( stray dogs) జ‌నానికి చుక్క‌లు చూపిస్తున్నాయి. ఉద‌యం, సాయంత్రం వేళ్ల‌ లో గల్లీల్లోకి వెళ్లాలంటే భయం.. పిల్లల ను బయటకు పంపాలంటే టెన్ష‌న్ మార్నింగ్ వా కింగ్‌కు వెళ్లాలన్నా, రాత్రి వేళ‌ ఇంటికి చేరుకోవాలన్నా వీధికుక్కల భయంతో ప్రజ లు బిక్కుబిక్కుమంటున్నారు. గ్రేట‌ర్ వ‌రం గ‌ల్ ప‌ర‌దిలో పిచ్చి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతున్నా అధికారులు చాలా తేలిక‌గా తీసుకుంటూ ప‌రిష్కారం చూప‌ డంలేదంటూ ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడు తున్నారు.
తాజాగా హన్మకొండ ఎక్సైజ్ కాలనీ రోడ్డు నంబర్‌ 5లో ఏడేళ్ల అరవిక్‌పై ఐదు వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గా యపరిచాయి. ఎంజీఎం ద‌వాఖాన‌లో చికి త్స పొందుతున్నాడు. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఆ చిన్నారి స్థానంలో మరొకరు ఉంటే పరిస్థితి ఏమిటి? ప్రాణనష్టం జరిగితే బాధ్యత ఎవరిది?

Dogs

ప్రజల ప్రాణాలకు హక్కులు లేవా?

జంతువులను సంరక్షించాల్సిన బాధ్యత స మాజంపై ఉంది. అయితే అదే సమయంలో మనుషుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? వీధికుక్కల నియంత్ర ణకు చర్యలు చేపట్టే సమయం లో జంతు సంరక్షణ సం ఘాల అభ్యంతరాలు ఎదురవుతున్నాయనే ఆందోళనలు ఉన్నాయి. జంతు వులపై క్రూరత్వాన్ని ఎవరూ సమర్థించరు. కానీ జంతు సంరక్షణ పేరుతో ప్రజల భద్రత ను విస్మరించడం ఎంతవరకు సమంజసం? జంతు ప్రేమికులు, అధికారులు పరస్పరం సహకరించి చట్టబద్ధమైన, మానవీయమైన పరిష్కారాన్ని కనుగొనాలి. కుక్కల సంతాన నియంత్రణ, రేబిస్ టీకాలు, దాడులకు పాల్పడే కుక్కలపై నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలి.

నగరమంతా ఇదే పరిస్థితి!

ఇది కేవలం ఎక్సైజ్ కాలనీకి పరిమితమైన సమస్య కాదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనేక డివిజన్లలో వీధికుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, పాఠ శాల విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గుర య్యే పరి స్థితులు నెలకొన్నాయి. కుక్కలు వెంటపడ టంతో వాహనదారులు అదుపుతప్పి పడిపోయే ప్రమాదమూ ఉంది.

మరో చిన్నారి బలయ్యే వరకు వేచి చూస్తారా?

జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ తక్ష ణమే స్పందించి డివిజన్లవారీగా వీధికు క్కల సమస్యను సమీక్షించాలని ప్రజలు కోరుతు న్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలి. ఫిర్యాదులపై వెంటనే స్పందించే వ్యవస్థను అందుబాటులోకి తేవాలి. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడం కాదు.. ప్రజలు నిర్భయంగా వీధుల్లో నడిచే పరిస్థితి కల్పించడం కూడా! మరో చిన్నారి తీవ్రంగా గాయపడకముందే, మరో కుటుం బం కన్నీరు పెట్టుకోకముందే ప్రభు త్వం, జిల్లా యంత్రాంగం మేల్కొని వీధికుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *