జీవవైవిధ్య సంరక్షణకు ప్రాధాన్యం

– అటవీ సంపదను భవిష్యత్ తరాలకు అందించాలి
– అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. రాష్ట్ర అటవీ దళాల నూతన ప్రధాన సంరక్షణాధికారి (పీసీసీఎఫ్)గా బాధ్యతలు స్వీకరించిన వినయ్ కుమార్ మంత్రి సురేఖను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అటవీ సంపద పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపు, జీవ వైవిధ్య సంరక్షణ, సామాజిక అటవీ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడంపై చర్చించారు. ప్రభుత్వ లక్ష్యాలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, తదితర అంశాలపై కూడా సమగ్రంగా చర్చించారు. అటవీ సంపదను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. అటవీ శాఖ కార్యక్రమాల అమలులో సాంకేతికత వినియోగం, అటవీ రక్షణ చర్యల బలోపేతం, పచ్చదనం పెంపుదల, అటవీ అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణను మరింత వేగవంతం చేయాలని మంత్రి సురేఖ వినయ్ కుమార్‌కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అటవీ శాఖ పూర్తి నిబద్ధతతో పనిచేస్తుందని వినయ్ కుమార్ హామీ ఇచ్చారు. అడవుల సంరక్షణకు అహర్నిశలు కృషి చేస్తూ అటవీ సంపదను కాపాడుతున్న అటవీ అధికారులు, సిబ్బందికి ఏటా అవార్డులు, నగదు ప్రోత్సహకాలు అందించేలా చర్యలు చేపట్టినందుకు పీసీసీఎఫ్ వినయ్ కుమార్ మంత్రి సురేఖకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అటవీ రంగంలో ఈ చర్య మైలురాయిగా నిలుస్తుందని, అటవీ సిబ్బంది సేవలకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవానికి ఇది నిదర్శనమని అన్నారు. కాగా, తనను కలిసిన పదవీ విరమణ చేసిన పీసీసీ¾ఎఫ్ సువర్ణను మంత్రి సురేఖ చీరతో సత్కరించి అభినందలు తెలిపారు. అటవీ శాఖకు ఆమె అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. భావి జీవితం సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *