ఇంటింటికీ వెళ్లి గణన పత్రాలు ఇవ్వాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: బీఎల్‌వోలు కచ్చితంగా ఇంటింటికీ వెళ్లి గణన పత్రాలను స్వయంగా ఓటర్లకు అందచేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎసఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో శుక్రవారం పర్యటించి ఆ ప్రక్రియ తీరును పరిశీలించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ నెం.211, బంజారాహిల్స్ పరిధిలోని ఫిల్మ్ నగర్ ఎంఆర్‌సీ కాలనీలో ఉన్న పోలింగ్ స్టేషన్ నం.184ను సందర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కోకాపేట, మంచిరేవుల ప్రాంతాల్లో గల పోలింగ్ ¿ంద్రరాలను సందర్శించి ఎసఐఆర్ ప్రక్రియ పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్ల గణన పురోగతిని తెలుసుకున్నారు. అలాగే శాశ్వతంగా తరలివెళ్లిన, మరణించిన, డూప్లికేట్ ఓటర్ల ధ్రువీకరణ, పరిష్కారం కోసం సరైన ప్రక్రియను అనుసరించాలని బీఎల్‌వోలను ఆదేశించారు. అలాగే బీఎల్‌వో యాప్ ద్వారా శాశ్వతంగా నివాసం మారిన వారు, మరణించిన వారు, డూప్లికేట్ ఓటర్ల వివరాల పరిశీలన, తొలగింపు ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలని ఆదేశించారు. ఓటర్లు ఆన్ లైన్ ష్ట్రttజూs://ఙశీtవతీs.వcఱ.స్త్రశీఙ.ఱఅ ద్వారా కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని, ఈ విషయంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ పర్యటనలో ఖైరతాబాద్ ఈఆర్‌వో, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *