– మహమ్మదాబాద్ లో డీఎంహెచ్ ఓ ఆకస్మిక తనిఖీల్లో వెలుగులోకి..
– అర్హత లేని ‘ఆర్ఎంపీ’ క్లినిక్లపై వేటు.. ఏడు క్లినిక్లు సీజ్
– అతిగా యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్ల వాడకంపై తీవ్ర ఆగ్రహం
మహబూబ్ నగర్ ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : వైద్య విద్య అర్హతలు లేకుండా, స్థాయికి మించి వైద్య చికిత్సలు అందిస్తున్న క్లినిక్ లపై జిల్లా వైద్యారోగ్య శాఖ ఉక్కుపాదం మోపింది. మహమ్మదాబాద్ పరిధిలో సరైన అర్హత పత్రాలు లేకుండా నడుస్తున్న ఏడు ప్రైవేట్ క్లినిక్ లను డిఎం హెచ్ఓ డాక్టర్ ఎ.శ్రీనివాసులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి సీజ్ చేయాలని ఆదేశించారు. గ్రామంలోని పలు క్లినిక్ పై అందిన ఫిర్యాదుల మేరకు డిఎంహెచ్ఓ బృందం దాడులు నిర్వహించింది. తనిఖీల్లో ది గ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చా యి. అర్హత లేని వ్యక్తులు రోగులకు ఇ ష్టారాజ్యంగా యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు ఇవ్వడం, నెబ్ జర్లు వాడటం చూసి అధికారులు విస్తుపోయారు. కొందరు హోమియోపతి, యునానీ వైద్య విద్య చదివి, చట్టవిరుద్ధంగా ఆలోపతి (ఇంగ్లీష్) వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు.
ప్రాణాలతో చెలగాటం
డీఎంహెచ్ ఓ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ పరిమితికి మించి స్టెరాయిడ్లు, ఐవి ఫ్లూయిడ్స్, ఐవీ బలమైన యాంటీబయోటిక్స్ ఇవ్వడం వల్ల రోగుల్లో వ్యాధి నిరోధక శక్తి క్షీణించి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. ఫస్ట్ ఎయిడ్ (ప్రథమ చికిత్స) సెంటర్లు కేవలం ప్రథమ చికిత్సకు మాత్రమే పరిమితం కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ హైడోస్ ఇంజెక్షన్లు, ఫ్లూయిడ్లు ఇవ్వొద్దని తేల్చిచెప్పారు. తనిఖీల సమయంలో క్లినిక్లో వాడిన సిరంజీలు, ఇంజెక్షన్ సూదులు, కాటన్ వంటి ప్రమాదకరమైన ‘బయో మెడికల్ వేస్ట్’ను ప్లాస్టిక్ టబ్బులు, అట్టపెట్టెల్లో మూతలు కూడా లేకుండా పడేసినట్లు అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ పొందిన క్లిని క్లలు కూడా తమ వ్యర్థాలను నిబంధనల ప్రకారం శాస్త్రీయంగా నిర్మూలించే సంస్థల కే అందజేయాలని, బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తా మని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిం చిన 7 క్లినిక్లను అక్కడికక్కడే సీజ్ చేసిన ట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎయిడ్స్-లెప్రసీ నివారణా ధికారి డాక్టర్ రాజు, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శివకాంత్, హెల్త్ ఎడ్యుకేటర్ హ న్మంతు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





