త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు

– మెట్రోతో మరో 50 బస్సులు అనుసంధానిస్తాం
– పీఎం ఈ-డ్రైవ్‌ ‌కింద నగరానికి 2,200 బస్సులు
– కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చాం
– రవాణశాఖ మంత్రి పొన్నం వెల్లడి

హైదారాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ‌గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని మూసివేసే పరిస్థితి ఉండగా ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌  ‌తెలిపారు. శానససభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయ‌న‌ సమాధానాలిచ్చారు. పీఎం ఈ-డ్రైవ్‌ ‌కింద హైదరాబాద్‌ ‌నగరానికి 2,200 బస్సులు రాబోతున్నాయని తెలిపారు. ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికలను గత ప్రభుత్వం రద్దు చేసిందని, ఎన్నికలపై సంఘాల నేతలతో చర్చలు జరుగుతున్నాయని, కార్మిక సంఘాల ఎన్నికల తర్వాత ఆర్టీసీ వీలీన ప్రక్రియ ఉంటుందని మంత్రి తెలిపారు. త్వరలో ఎన్నికల తేదీపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చామ‌ని, హైదరాబాద్‌ ‌నగరానికి 100 మినీ బస్సులు రాబోతున్నాయ‌ని, వాటిలో 50 పాత బస్తీకి, మరో 50 బస్సులు ఎంఎంటీఎస్‌, ‌మెట్రోతో అనుసంధానిస్తాం అని తెలిపారు. 347.47 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం పొందగలిగారని, ఇది ఒక చరిత్ర అని తెలిపారు. ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత కొత్త బస్టాండ్లు నిర్మిస్తామ‌ని చెప్పారు. బస్టాండ్ల అభివృద్ధికి ఆర్థికంగా ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లకు ఆర్టీసీ స్థలం అందించామ‌ని చెప్పారు. ఆర్టీసీ విలీనమైన ఏపీలో అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *