– ప్రతిపక్ష కూటమి మరింత బలోపేతం
– కాంగ్రెస్ సమావేశంలో అగ్రనేత రాహుల్ గాంధీ
న్యూదిల్లీ, ఆగస్ట్ 20 : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై లోక్సభ లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్డీయేలో బీజేపీ రాజకీయ ఆధిపత్యం క్షీణించిందని, మోదీ, అమిత్ షా రాజకీయ ప్రయాణం ముగిసిపోయింద ని అన్నా రు. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లా డుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీకి స్వతంత్రంగా మెజారిటీ లేకపోవడంవల్ల ఆ పార్టీ రాజకీయ శక్తి, పట్టు పూర్తిగా తగ్గిపో యాయని రాహుల్ గాంధీ అన్నారు. గతంలో చూపిన రాజ కీయ ఆధిపత్యాన్ని మోదీ, అమిత్ షా జోడీ ఇప్పుడు కోల్పో యిందని పేర్కొన్నారు. ఈ నేప థ్యంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ, ‘ఇండియా’ కూటమి మరింత వ్యూహాత్మకంగా ముందు కు సాగుతోందని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యక ర్తలు ప్రజల సమస్యలపై పోరాటాన్ని మరిం త తీవ్రతరం చేయాలని, రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





