– చర్చకు సవాల్ చేసిన బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
– అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి కోసం ఎదురుచూపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని, హౌస్ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతిపై చర్చకు సిద్ధమా? అంటూ మంత్రి శ్రీనివాస రెడ్డికి బుధవారం సవాల్ చేశారు. తన సవాల్‌ను స్వీకరిస్తే అసెంబ్లీ మీడియా పాయింట్‌కు రావాలని కోరారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఏలేటి చేరుకున్నారు. ఈ సందర్భంగా తన సవాల్‌పై చర్చకు రావాలని మంత్రిని ఏలేటి మరోసారి డిమాండ్ చేశారు. తాను మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడే ఉంటానని, శ్రీనివాస రెడ్డి రావాలని డెడ్ లైన్ విధించారు. ఈ సందర్భంగా భూభారతి, 22ఏలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఫీనిక్స్, రాఘవ కన్‌స్ట్రక్షన్ సంస్థలకు భూ బదలాయింపులు జరిగాయన్నారు. ప్రభుత్వ, ప్రజల భూములను లాక్కున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పొంగులేటి వచ్చి వివరణ ఇచ్చే వరకు తాను కదిలేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇస్తారా లేక పొంగులేటి ఇస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఎవరొచ్చినా సరే తన వద్ద ఉన్న ఆధారాలను అందిస్తానని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం