రాజకీయ ఉద్రిక్తత

– కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లపర్వం
– తెలంగాణ భవన్ వద్ద హరీష్ రావు, తదితరుల అరెస్ట్‌
– గన్ పార్కు వద్ద చర్చకు సిద్దం అంటూ మంత్రుల బైఠాయింపు
– రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై2: రాష్ట్ర రాజ కీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకు న్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో పాలిటిక్స్ హీ టెక్కాయి. కాంగ్రెస్ పార్టీ రెండున్నరేండ్ల చెత్త పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ నిప్పులు చెరిగారు. అవినీతి, అక్రమాలపై లెక్కలతో పక్కాగా వివరిస్తాననిస్పష్టం చేశా రు. డేట్ అండ్ టైం ప్లేస్ ఏదైనా సరే.. ‘వరం గల్ ప్రెస్ క్లబ్లోనా? అశోక్నగర్లోనా? అ సెంబ్లీలోనా? వేదిక ఏదైనా బీఆర్ఎస్ తరఫున తాను చర్చకు వస్తా.. రాహుల్ గాంధీ వస్తారో ? ఇంకెవరొస్తారో తేల్చుకోండి. పాలనా వైఫల్యాలను లెక్కలతో బయటపెట్టకపోతేరా జకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటాన ని చాలెంజ్ చేశారు. కాగా, కేటీఆర్ సవాల్కు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాను తెలంగాణ భవన క్కు గురువారం 11 గంటలకు వస్తానని మంత్రి ప్రతి సవాల్ విసి రారు. మంత్రి చాలెంజ్ను స్వీకరిచిన బీఆర్ ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో కోసం ప్రత్యే కంగా కుర్చీ రెడీగా ఉంది. మీదే ఆలస్యం దమ్ముంటే చర్చకు రావాలన్నారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అటు తెలంగాణ భవన్, ఇటు గాంధీ భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చే శారు. జూపల్లి వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావు బీఆర్ఎస్ భవన్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జూపల్లి వస్తే కేంద్ర ప్రభుత్వ నివేదికలు, ఆర్ బీఐ లెక్కలు, సాక్ష్యాలతో సహా వివరిస్తామని వారు తెలిపారు. కాగా, జూపల్లితో చర్చకు కేటీఆర్ అవసరం లేదని తాను సరిపోతానని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కావాలంటే కేటీఆర్ కూడా వస్తారన్నారు. ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఎన్ని నెరవేర్చారో చర్చకు బరాబర్ సిద్ధమేనన్నారు. కాంగ్రెస్ అప్పుల బాగోతాన్ని లెక్కలతో తిప్పికొడతామన్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. ఇదిలావుంటే గురుకులాల్లో టెండర్ల లో అవినీతి ఆరోపణలపై చర్చల్లో ట్విస్టు చోటుచేసుకుంది. కేటీఆర్, హరీశ్ రావు గన్ పార్కు రావాలని మంత్రులు సవాల్ విసి రారు. ఈ నేపథ్యంలో గురుకులాల్లో అవినీతిపై చర్చకు హరీష్ రావు సిద్ధమయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి గన్పార్క్ బయలు దేరారు. గురు కులాలపై చర్చకు మే ము ప్రెస్ క్లబ్ రమ్మంటే మంత్రులు గన్పార్క్ రమ్మన్నారు. మాకు ఎలాంటి భేషజాలు లేవు. మీరు రమ్మన్నారు మేము వస్తున్నామని తెలిపారు. చర్చకు ఎక్కడికైనా మేము సిద్ధమని పేర్కొన్నారు. ఎలాంటి గొడవలు వద్దు కూర్చొని మాట్లాడుకుందామన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వారికి టెండర్లు ఇచ్చారని ఆరోపించారు. ఒకవేళ మంత్రి జూపల్లి తెలంగాణ భవన్కు వెళ్తే..కేటీఆర్ చర్చించేందుకు రెడీగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా, గన్పార్కు బయలు దేరిన హరీశ్ రావును పోలీసులు అడ్డుకోవడంతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముగ్గురు మంత్రులు రమ్మంటేనే మేము వెళ్తున్నాం. ఎందుకు ఆపుతున్నారని పోలీసులను ప్రశ్నించారు. కావాలంటే మంత్రి పొన్నం ప్రభాకర్కు ఫోన్ చేయాలని పోలీసులకు సూచించారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని చర్చలను అడ్డుకుంటుందని హరీశ్ రావు మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి గన్ పార్కు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కారు దిగి పాదయాత్రగా వెళ్లేందుకు హరీష్ రావు యత్నించారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన తోపులాటలో ఆయన కిందపడిపోయారు. ఆ వెంటనే మాజీ మంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీశ్తో పాటు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులను అడ్డుపె ట్టుకుని ప్రభుత్వం పారిపోయిందంటూ దుయ్యబట్టారు. అవినీతి జరిగింది కాబట్టే భయపడుతు న్నారన్నారు. తాము చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గన్పర్క్క ముగ్గురు మంత్రు లూ చేరుకుని.. అమరవీరుల స్థూపం దగ్గర కూర్చున్నారు. మంత్రులకు మద్దతుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గన్పర్కు వచ్చారు. మంత్రులు, మాజీ మంత్రుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో గన్పార్క్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అటు సోమాజీగూడ ప్రెస్ క్లబ్, తెలంగాణ భవన్ దగ్గర కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *