హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందించే పీఎం రాహత్ పథకంలో రాష్ట్రంలోని అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్‌ను నమోదు చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. ప్రధాన మంత్రి రోడ్డు ప్రమాద బాధితులకు దవాఖానాల్లో మెరుగైన చికిత్సా పథకం (పీఎం రాహత్) అమలుపై రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ట్రాన్స్పోర్ట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రవాణా శాఖ కవీమిషనర్ ఇలంబర్తి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, ఆరోగ్యశ్రీ సిఈవో జె.హనుమంతులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను తక్షణమే గోల్డ్ అవర్‌లో సమీపంలోని హాస్పిటల్లో చేర్చితే వైద్య చికిత్సలకు పీఎం రాహత్ పథకం కింద రూ.లక్షన్నర విలువైన చికిత్సలు అందించనున్నట్లు చెప్పారు. అయితే ఈ పథకంలో రాష్ట్రంలోని హాస్పిటల్స్ నమోదు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలో వెయ్యికిపైగా హాస్పిటల్స్ నమోదు కాగా ఈ పీఎం రాహత్ స్కీమ్‌లో 469 హాస్పిటల్స్ మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. మిగిలిన వాటినీ ఈ పీఎం రాహత్ పథకంలో నమోదు అయ్యే విధంగా తగు చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఈ పథకం కింద ప్రతీ సంవత్సరం కనీసం రూ.వంద కోట్ల విలువైన చికిత్సలను అందించే అవకాశం ఉందని వివరించారు. తద్వారా ఆరోగ్యశ్రీ పథకానికి కూడా భారం తగ్గుతుందన్నారు. అయితే ‘పీఎం రాహత’ కింద చికిత్సలు జరపాలంటే పోలీసు దర్యాప్తు తదితర నిబంధనలను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





