– హాజరైన డీజీపీ ఆనంద్, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : భారత్ ఫ్యూచర్ సిటీలో పలు అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్, సీపీ తరుణ్‌జోషి, ఇతర అధికారులు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పాల్గొన్నారు. అనంతరం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్ఐయూఎం) క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





