ప్రజాపాలనకు ప్రజలే కేంద్ర బిందువు

– ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజలకు భట్టి శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే దిశగా ప్రజాపాలన జరుగుతోందని చెప్పారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భట్టి విక్రమార్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పాలనను ప్రజల వద్దకే తీసుకెళ్లడం, వారి సమస్యలను నేరుగా వినడం, అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడమే ప్రజాపాలన సారమని పేర్కొన్నారు. రైతు ముఖంలో చిరునవ్వు, యువత చేతిలో ఉపాధి, మహిళలకు భద్రతతోపాటు సాధికారత, ఉద్యోగులకు భరోసా, పేదల జీవితాల్లో వెలుగులు నింపడం ప్రజాపాలన లక్ష్యాలని భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగినప్పుడే ప్రజాపాలనకు నిజమైన సార్థకత చేకూరుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలే ప్రజాపాలనకు పునాది అని, ప్రజల సంక్షేమమే ప్రజాపాలనకు గమ్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజలే పాలనకు కేంద్ర బిందువుగా నిలిచే తెలంగాణను నిర్మించేందుకు అందరం కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *