– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
– ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలుఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్17: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఖమ్మం పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17న భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టిన తెలంగాణ వెయ్యి రోజుల ప్రజా పాలనలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం ఉద్యమించిన యోధుల వెలకట్టలేని త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యతన్నారు. ప్రజా పాలనలో పేదలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యతనిచ్చామని డిప్యూటీ సీఎం తెలిపారు. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యమే లక్ష్యంగా తెలంగాణను హరిత ఇంధన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం, పాలేరు లింక్ కాలువ, మున్నేరు-పాలేరు లింక్ కాలువ, జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేశామని తెలిపారు. ఖమ్మం నగరాన్ని వరదల నుంచి రక్షించేందుకు రూ.525.36 కోట్లతో వరద రక్షణ గోడ నిర్మిస్తున్నామన్నారు. జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తూ హాస్పిటల్స్‌లో అత్యాధునిక వైద్య వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో తొలి దశలో 16,597 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి రూ.491.8 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. టీ-ఐపాస్, పీఎమ్‌ఈజీపీ ద్వారా రూ.577 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించి యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రతి కుటుంబ సంక్షేమం, ప్రతి ప్రాంత సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని భట్టి స్పష్టం చేశారు. వేడుకల్లో భాగంగా పీఎంశ్రీ జెడ్పీహెచ్ ఎస్, పందిళ్లపల్లి విద్యార్థినులు ప్రదర్శించిన ప్రజాపాలన పాట, ఎంజేపీటీబిసి, డబ్ల్యూఆర్జేసి, లంకపల్లి, దానవాయిగూడెం విద్యార్థినులు ప్రదర్శించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పాట, టీజీఎస్డబ్ల్యుఆర్ఎస్, జేసి టేకులపల్లి విద్యార్ధులు ప్రదర్శించిన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పాటపై నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. అనంతరం వ్యవసాయ, ఉద్యానవన, డిఆర్డిఎ, సంక్షేమం, వైద్య ఆరోగ్య, అటవీ, విద్యా, ఎస్సీ/ఎస్టీ/బిసి/మైనారిటీ సంక్షేమం, విద్యుత్, సైబర్ నేరాలు, టిజి ఆర్టీసీ, పౌరసరఫరాలు, మోడల్ స్కూల్స్ శాఖలచే ఏర్పాటుచేసిన స్టాళ్లను భట్టి పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్లు డా. పి.శ్రీజ, పి.శ్రీనివాస రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాంమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ముదిగొండ/ఖమ్మం : ముదిగొండ మండలం చిరుమర్రి చెరువు వద్ద రూ. 2.90 కోట్లతో పర్యాటక వసతుల అభివృద్ధి పనులకు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శంకుస్థాపన చేశారు. ఇక్కడ చెరువును ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా చెరువును సుందరీకరిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం వైఏటీ & సి శాఖ ద్వారా రూ. 2.90 కోట్ల పరిపాలనా అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్ణీత ఆరు నెలల గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ పర్యాటకుల సౌకర్యార్థం రెండు ఫుడ్ కియోస్క్‌లు, విశ్రాంతి కోసం సుందరమైన గెజిబోలు, ఆధునిక టాయిలెట్ బ్లాక్, మెరుగైన విద్యుద్దీకరణ, ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేప్, హార్డ్‌స్కేప్ తోటలు, నడక దారులు, విశాలమైన పార్కింగ్ వసతులను అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలోనే పనులన్నీ పూర్తి చేసి ఈ పర్యాటక కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. ముదిగొండ మండల కేంద్రంలో గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ. 40 లక్షలతో చేపడుతున్న నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి భట్టి శంకుస్థాపన చేశారు. వనంవారి కృష్టపురం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 20 లక్షలతో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ టిఎస్ దివాకర, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, విద్యుత్ శాఖ ఎస్ఇ శ్రీనివాసా చారి, ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్ రావు, పీఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, సిపిఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు