– కేంద్ర క్రీడల శాఖ మంత్రికి రాష్ట్ర మంత్రి ఆహ్వానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈమేరకు దిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాను పశు సంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ శివసేనారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ వీసీ అండ్ ఎండీ సోనిబాలాదేవిలు కలిసి ఆహ్వానించారు. రాష్ట్రంలో క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు యువ క్రీడాకారులకు జాతీయస్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి తెలంగాణను దేశ క్రీడా పటంలో మరింత బలమైన రాష్ట్రంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి శ్రీహరి తెలిపారు. ఖేలో ఇండియా కార్యక్రమ నిర్వహణ కోసం తెలంగాణను ఎంపిక చేసినందుకు ఆయన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


