ఉస్మానియా పాలకమండలి సభ్యునిగా రవీందర్‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ ‌కౌన్సిల్‌ ‌మెంబర్‌గా డాక్టర్‌ ‌సూరం రవీందర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ ‌యోగితారాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండకు చెందిన డాక్టర్‌ ‌సూరం రవీందర్‌రెడ్డి ఎల్‌బి కళాశాలలో కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులుగా పని చేసి రిటైరయ్యారు. 1996 నుంచి 2004 వరకు సుదీర్ఘకాలం పాటు కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యునిగా రవీందర్‌రెడ్డి పని చేశారు. కెయుతో పాటు ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. కెయులో అనేక కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో రవీందర్‌రెడ్డి విశేషంగా కృషి చేశారు. ఉస్మానియా పాలకమండలి సభ్యునిగా రవీందర్‌రెడ్డి నియామకం పట్ల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు కెయు, ఎల్‌బి కళాశాల, నగరానికి చెందిన పలువురు హర్షం ప్రకటించారు. కాగా ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలిలో మొత్తం 9మంది సభ్యులను ప్రభుత్వం నియమించింది. పరిశ్రమలు, వ్యవసాయం, వ్యాపారం, విద్య, సామాజిక న్యాయ రంగాల్లో విశేషంగా సేవలందించినందుకు గాను నలుగురిని పాలకమండలిలో నియమించారు. హన్మకొండ నుంచి డాక్టర్‌ ‌సూరం రవీందర్‌రెడ్డి, మెదక్‌ ‌జిల్లా రామాయన్‌పేట నుంచి న్యాయవాది, విద్యావేత్త డాక్టర్‌ ‌పి.మధుసూదన్‌రెడ్డి, జెఎన్‌టియు మాజీ రిజిస్ట్రార్‌, ‌టిజిపిఎస్‌సి మాజీ మెంబర్‌ ఎన్‌.‌యాదయ్య, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్‌ ‌వి.గోపాల్‌రెడ్డిలు ఉన్నారు. ప్రొఫెసర్‌ల కోటా నుంచి ఓయు మెకానికల్‌ ఇం‌జనీరింగ్‌ ‌విభాగం నుంచి సీనియర్‌ ‌ప్రొఫెసర్‌ ‌టి.ఉషశ్రీ, ప్రిన్సిపాల్‌ ‌కోటా నుంచి ఓయు కాలేజ్‌ ఆఫ్‌ ‌సైన్స్ ‌ప్రిన్సిపాల్‌ ఎం.‌విజ్యులత, అనుబంధ డిగ్రీ కళాశాల నుంచి గోల్కోండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ‌డాక్టర్‌ ‌శ్రీలక్ష్మి, విశ్వవిద్యాలయ అధ్యాపకుల కోటా నుంచి ఓయు ఇంజనీరింగ్‌ ‌కళాశాల అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌టి.సుజాత, అనుంబంధ డిగ్రీ కళాశాల నుంచి హైదరాబాద్‌ ‌ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్‌ ‌జె.నీరజను సభ్యులుగా నియమించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *