– మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్‌పై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తేజస్వి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేలా ఉన్నాయని, వాటిని లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే తేజస్వి లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ’తెలంగాణ డీఎన్ఏ ఉన్న ఎవరైనా తేజస్వి వ్యాఖ్యలను ఖండించాలన్నారు. ఈ విషయమై తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదన్నారు. తేజస్వి సూర్య ఓ తెలివి లేని వ్యక్తి అంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పాటుపై ఇంత అజ్ఞానంగా మాట్లాడతారా.. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాష్ట్రాన్నే అవమానిస్తారా అంటూ ఆక్షేపించారు. తేజస్వి రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడారన్నారు. పోరాటం ద్వారా ఏర్పాటైన తెలంగాణను అవమానించారు అని పొన్నం పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





