తుమ్మిడిహట్టిపై మహారాష్ట్రతో నిరంతర చర్చలు

– ముంపు భూముల పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలి
– పరిహారం చెలింపునకు ప్రభుత్వం సిద్ధం: సీఎం రేవంత్ 

హైదరాబాద్, ప్రజాతంత్ర : తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్ర‌భుత్వంతో నిరంతరం సంప్రదింపులు జర పాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నీటిపారుదల జాఖ అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని, గతంలో కుదిరిన ఒప్పందాలు, ఇతర అంశాలకు సంబంధించిన పత్రాలను ఆ రాష్ట్ర అధికారులకు అందజేయాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లోని త‌న‌ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి అధికారులతో తుమ్మిడిహట్టి బ్యారేజీపై మంగ‌ళ‌వారం సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్ర ప్ర‌భుత్వంతో ఇటీవల జరిగిన చర్చలు, తదుపరి కార్యాచరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ఇందుకోసం అవసరమైన నిధులను ఉమ్మడి ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. ముంపు భూములపై మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సర్వే నిర్వహించినా తమకు అభ్యంతరం లేదని సీఎం స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర అధికారులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటి కప్పుడు అందించాలని సూచించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి శ్రీధర్, ఈఎన్సీ (జనరల్) రమేశ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *