ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి

– ఇండియన్ సెయిలర్ దుర్మరణం

న్యూదిల్లీ, నవంబర్ 3 : ఒమన్ తీరంలో భారత్ కు చెందిన నౌక ‘ఎంఎస్వి అల్ జుసుఫీ’ పై దాడి జరిగింది. నౌకపై గుర్తు తెలియని వైమానిక వస్తువు (డ్రోన్/వస్తువు) దూసుకు వ‌చ్చింది. ఈ ఘటనలో నౌకలోని ఓ భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 14 మంది భారత నావికులు ఉన్నట్లు పేర్కొన్నారు. వారిలో ఒకరు మరణించగా మిగతా 13 మందిని ఒమన్ కోస్ట్ గార్డ్ బృందాలు రక్షించినట్లు నేవీ అధికారులు తెలిపారు. వారికి తగిన సాయం అందేలా అక్కడి భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. మృతుడు గుజరాత్ కు చెందిన గంధర్ నహీం అజీజ్గా గుర్తించారు. ప్రాణాలతో బయటపడిన సిబ్బందిని, నావికుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్ కు రప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మృతుడి కుటుంబంతో మాట్లాడుతున్నామ‌ని, దాడి ఎవ‌రు చేశార‌నేది తెలియ‌రాలేద‌ని భార‌త ఎంబ‌సీ అధికారులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *