నగరంలో వొచ్చే మూడు రోజలు వానలు

– వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని కంపెనీలకు పోలీసుల సూచన

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : హైదరాబాద్ లో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కంపెనీలు రాబోయే మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని పోలీసులు సూచించారు. నగరంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఈనెల‌ 5 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం కీలకమైన అడ్వైజరీని విడుదల చేసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు తమ ఉద్యోగుల సురక్షత, రోడ్లపై ట్రాఫిక్ నివారణ, అత్యవసర సేవల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపింది. వర్షాలు ఉండే ఈ  మూడు రోజుల పాటు (నవంబర్ 3 నుండి నవంబర్ 5వ తేదీ వరకు) సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించడాన్ని ఒక ప్రత్యామ్నాయంగా పరిశీలించాలి. నగరంలో వర్షాల సమయంలో ట్రాఫిక్ ను సరిగ్గా నియంత్రించడానికి, అవసరమైన ప్రాంతాల్లో బలగాలను మోహరించడానికి ఐటీ కంపెనీలు తమ ముందస్తు ప్రణాళికలను పోలీసులకు తెలియజేయాలని కోరారు. వివరా లను cybtrec@gmail.com కు ఇమెయిల్ ద్వారా పంపాలని సూచించారు. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కంపెనీలు సాయంత్రం 4 గంటల లోపు లాగౌట్ ప్రక్రియను పూర్తి చేయాలని పోలీసు అధికారులు కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *