కొకైన్ అక్రమ రవాణా నెట్ వర్క్ గుట్టురట్టు

– రూ. 2 కోట్ల ఆస్తుల జప్తునకు పోలీసుల చర్యలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగిలో భారీగా సాగుతున్న కొకైన్ అక్రమ రవాణా నెట్ వర్క్ ను పోలీసులు ఛేదించారు. విలాసవంతమైన ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. ఈ కీలక ఆపరేషన్ లో సైబరాబాద్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్, నార్సింగి లోకల్ పోలీసులు, ఈగల్ వింగ్ సంయుక్తంగా ఆప‌రేష‌న్ చేప‌ట్టి నిందితులను అదుపు లోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ప్రత్యేక బృందాలు నిందితుల నుంచి 107.4 గ్రాముల కొకైన్ తోపాటు రెండు ఖరీదైన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ మార్కెట్ లో రూ. లక్షల్లో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ప్రధానంగా ఐటీ కారిడార్ పరిధిలోని ప్రముఖులు, యూత్ టార్గెట్ గా ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, నిందితులు సుదీర్ఘకాలంగా డ్రగ్స్ విక్రయించగా వచ్చిన ఆదాయంతో రూ.2 కోట్ల విలువైన స్థిరాస్తులు, ఇతర ఆస్తులను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఈ ఆస్తులన్నింటినీ జప్తు చేసేందుకు పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. ఈ నెట్వర్క్ లో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉందనే కోణంలో సమగ్ర విచారణ కొనసాగుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *