– వాట్సాప్ ద్వారా సమాచారం తెలుసుకునే వీలు
– ‘నీట్’ విద్యార్థులకు ఎన్‌టీయే కీలక ప్రకటన
న్యూదిల్లీ, జూన్ 19: ‘నీట్’ అడ్మిట్ కార్డులపై ఎన్‌టీఏ కీలక ప్రకటన చేసింది. కొత్త అడ్మిట్ కార్డులను ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. కొత్త అడ్మిట్ కార్డులను ఇంకా డౌన్‌లోడ్ చేసుకోని విద్యార్థుల కోసం ఎన్‌టీఏ నుంచి ఎస్ఎమ్‌ఎస్, ఈ-మెయిల్, వాట్సాప్ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. మే 3 నాటి పాత అడ్మిట్ కార్డులు ఇకపై చెల్లవని స్పష్టం చేసింది. కొత్త అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. పలువురు విద్యార్థుల కోరిక మేరకు వారు కోరిన నగరాల్లో కొత్త పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ‘నీట్’ అభ్యర్థుల కోసం ఎన్‌టీఏ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈనెల 21న ఆదివారం జరగబోయే రీ`ఎగ్జామినేషన్ సమాచారం ఇకపై నేరుగా వాట్సాప్ ద్వారా అభ్యర్థులకు అందనుంది. 91` 78279 80287 నంబర్ నుంచి మాత్రమే అధికారిక సమాచారం వస్తుందని ఎన్‌టీఏ వెల్లడించింది. బ్లూ టిక్ లేని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దని విద్యార్థులను హెచ్చరించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





