– మృతుల్లో తండ్రీకొడుకులు
– నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం
నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్ 19: నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలం రామన్నగూడెం వద్ద శుక్ర వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు కార్లు పరస్పరం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో తండ్రీకొడుకులతోపాటు మరొకరు ఉన్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. మృతిచెందిన తండ్రీకొడుకులు పల్నాడు జిల్లా ముప్పల్ మండలం కాకర్లపాలెం గ్రామానికి చెందిన కాకర్ల థామస్య(51), ప్రకాష్ రావు (35)గా గుర్తించారు. మరోవ్యక్తి వరంగల్ ఎసఎల్‌బీసీ సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సాయికుమార్(20)గా పోలీసులు తెలిపారు. ముగ్గురి మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



