రాష్ట్ర రాజకీయాల్లో క్షుద్ర పూజల రగడ

– అలాంటి పూజలతో ప్రభుత్వాలు కూలిపోతాయా..
– పాలకులే వాటిని నమ్మితే సమాజానికి ఎలాంటి సంకేతం?
– హరీష్ రావు లీగల్ నోటీసులతో తీవ్రమవుతున్న వివాదం

(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రతినిధి, వరంగల్)

ప్రపంచం విజ్ఞానశాస్త్రంలో పురోగతిని సాధిస్తుంటే పాలకులు మూఢనమ్మకాలపై విశ్వాసాన్ని వ్యక్తంచేయడం ఆశ్చర్యాన్ని కలిగి స్తున్నది. విద్య, వైజ్ఞానానికి దూరంగా ఉన్న జనం ఇలాంటివాటిని నమ్మారంటే అది వారి అవగా హనలోపం అనుకోవచ్చు. కానీ అశాస్త్రీయ నమ్మకాలపై ప్రజలను దూరంగా ఉంచాల్సిన పాలకులే వాటిపట్ల తమ భయాందోళనలను వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉంది. దీనివల్ల నిజంగానే క్షుద్రపూజలు చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయా ? రాష్ట్రంలో కరవు వాతావర ణం ఏర్పడుతుందా అన్న అనుమానాలకు తావే ర్పడుతున్నది. మన దేశంలో ప్రాచీన కాలం నుండి కొన్ని నమ్మకాలు, ఆచారాలు కొనసాగు తున్నాయి. అయితే శాస్త్రీయంగా వాటిని విడమ ర్చలేక పోయినప్పటికీ అవి నేటికీ వాడుకలో ఉంటున్నాయి. ఇందుకు ఒకటి అజ్ఞానం కావచ్చు లేదా భయం కూడా అయి ఉండవచ్చు. ఉదాహరణకు ప్రయాణ సమయంలో నల్ల పిల్లి ఎదురుగా వస్తే అపశకునమని కొంతసేపు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు. తుమ్మితే అశుభమనుకుంటారు. జంతు బలులైతేనేమీ, చిన్న పిల్లలను బలి ఇస్తే తమ పని నెరవేరుతుందన్న మూఢనమ్మకం పలుపురి ప్రాణాలను హరించిన సంఘటనలెన్నో ఉన్నాయి. అంతెందుకు నేటికీ గ్రామాల్లో ఎవరికో మంత్రాలు వస్తాయని వాళ్ళ వల్లే తమకు కష్టాలు వస్తు న్నాయంటూ మంత్రోచ్చారణకు వీలు లేకుండా వాళ్ళ నోటి పళ్లు రాలగొట్టడం, ఏకంగా చంపేయటం లాంటి ఘటనలు అక్కడక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. దీనివల్ల సమాజంలో అసమానతలు, భేదాభిప్రాయాలు చోటుచేసుకోవడంతోపాటు హింస హింస ప్రభలే ఆస్కారాలున్నాయి. ఇలాంటి మూఢ విశ్వాసాల నిరోధానికి ప్రభుత్వాలు, విద్యావేత్తలు వివిధ మాద్యమాలద్వారా సమాజాన్ని చైతన్యం చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా అంద విశ్వాసాలను మనస్సులోనుండి పూర్తిగా తుడిచివేయలేకపోతున్నారు. విచిత్రకర విషయమేమంటే ప్రజలను చైతన్యపర్చాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా విశ్వాసం వ్యక్తంచేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండీ ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ను ముఖ్యమంత్రి విమర్శించని రోజంటూ లేదు. అదికూడా మామూలుగా కాదు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఉపయోగించని పదజాలాన్ని ప్రయోగించడం సిఎం రేవంత్‌రెడ్డికి అలవాటైపోయింది. ఇతర విమర్శల సంగతి ఎలా ఉన్నా తనను గద్దె దింపాలని, రాష్ట్రంలో కరవు రావాలని ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు క్షుద్రపూజలు చేశాడంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి నోటివెంట ఈ మాటలు రావడం రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మూఢ విశ్వాసాలను నమ్మరాదని ప్రచారం చేయాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలాంటి ఆరోపణలు చేయడమేంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్రంలో తీవ్ర కరవు రావాలని కొందరు దుర్మార్గులు( పరోక్షంగా హరీష్‌రావును) క్షుద్ర పూజలుకూడాచేశారని, అయితే వరుణదేవుడు తమపట్ల ఉండ టంవల్ల వానలు పడ్డాయని, క్షుద్ర పూజలు చేసినవారికే అవి రివర్స్ అవుతాయంటూ సాధారణ వ్యక్తిలా ఆయన మాట్లాడటంపట్ల పలు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికూడా వాటిని నమ్ముతున్నాడన్న భావన సామాన్య ప్రజల్లో ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. దానికి తగినట్లు  పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌, ఆ ‌పార్టీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్‌రెడ్డికూడా అదే అంశాన్ని తీసుకుని హరీష్‌రావుపై, బిఆర్‌ఎస్‌ ‌నాయకులపై మాటల దాడి మొదలుపెట్టడం విచిత్ర పరిణామం. అనేక అంశాలను తీసుకుని హరీష్‌రావు ప్రభుత్వంపైన చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేకనే ‌పనిగట్టుకుని ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఆరోపిస్తున్నారు. మూకాంబికా దేవి శక్తి స్వరూపిణి అని, అమ్మవారిని రాజకీయాలకు వాడుకోవడమేంటంటున్నారు వారు. అనేకమంది రాజకీయ నాయకులు మూకాంబికా దేవిని సందర్శించుకుంటున్నారని, వారంతా క్షుద్రపూజలు చేయడానికే వెళ్తున్నారా అని ప్రశ్నించారు. తనపై నిరాధార, అసత్య ఆరోపణలను రాజకీయ కక్షతోనే  చేస్తున్నారంటున్న హరీష్‌రావు  సిఎం రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ ‌నాయకులకు లీగల్‌ ‌నోటీసును పంపిన విషయం తెలిసిందే. ఏదిఏమైన క్షుద్ర పూజల అంశం రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారి తీసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *