సీఎం సభకు సర్వం సిద్ధం

– ముఖ్యమంత్రిగా రేపు తొలిసారి సిరిసిల్లకు రేవంత్
– భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి
– రూ.345.78 కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్న సీఎం

సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి సిరిసిల్లలో బుధవారం పర్యటించనున్నారు. భారీ బహిరంగ సభతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వేములవాడలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, రాజన్న ఆలయ అభివృద్ధి, కొత్త ప్రభుత్వ కార్యా లయాలు, నేతన్న బజార్ వంటి కార్యక్రమాలు ఈ పర్యటనలో ఉన్నాయి. అయితే ప్రభుత్వ పరంగానే కాకుండా రాజకీయ పరంగానూ ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కే టీఆర్ ఇలాఖాలో రేవంత్ రెడ్డి సభ పెట్టడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పటిష్ట భద్రతా ఏర్పాట్లు

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాల్గొననున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతి నిధులు సమన్వయంతో సభా ప్రాంగణం, పార్కింగ్, ట్రాఫిక్, భద్రత తదితర ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానుండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సభా ప్రాంగణంలో వేదిక, బారికేడ్లు, కుర్చీలు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ రాకపోకలకు ఆటంకాలు లేకుండా ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. సభకు వొచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసి, ప్రజలకు ఇబ్బందులు కల గకుండా పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తు న్నారు. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సభ విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. మొత్తానికి సభ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ముఖ్యమంత్రి పర్యటనకు సిద్దమైంది.

సిరిసిల్ల సభకు భారీగా తరలిరావాలి : మంత్రి పొన్నం 

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిరిసిల్లకు రానున్న నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, విజయరమణారావు, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, కేకే మహేందర్రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడారు. సీఎం సిరిసిల్ల పర్యటన, భారీ బహిరంగ సభకు సంబం ధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయం, విద్య, వైద్యంతోపాటు కార్మికులు, విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తోందన్నారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రజలపై అదనపు పన్నుల భారం మోపకుండా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అందరూ కలిసి పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి సిరిసిల్ల వేదికగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రతిపక్షాల వైఖరిపై తన సందేశాన్ని ఇవ్వనున్నారని మంత్రి అన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా పనిచేసి సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *