జనగణనపై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్‌

– 40 ‌ప్రశ్నలతో కూడిన జాబితాను నోటిఫై చేసిన కేంద్రం

న్యూదిల్లీ, ఆగస్టు 14 : దేశవ్యాప్తంగా చేపట్టనున్న ’జనగణన-2027’పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా సమగ్ర కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జనగణనలో పౌరులను అడిగే 40 ప్రశ్నలతో కూడిన జాబితాను రిజిస్ట్రార్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ఇం‌డియా నోటిఫై చేసింది. జనగణన ప్రశ్నావళిలోని 10వ ప్రశ్నగా ఎస్సీ, ఎస్టీ, కులానికి సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక అవకాశం కల్పించారు. దేశంలోనే తొలిసారిగా యాప్‌లు, డిజిటల్‌ ‌సాధనాల ద్వారా జనాభా లెక్కల సేకరణ చేపట్టనున్నారు. 15 రోజుల పాటు స్వయంగా వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. రూ.11,718.24 కోట్ల అంచనా వ్యయంతో జనగణన-2027ను రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశలో 2026 ఏప్రిల్‌ ‌నుంచి సెప్టెంబర్‌ ‌మధ్య గృహాల నమోదు, వసతులకు సంబంధించిన వివరాల సేకరణ చేపట్టనున్నారు. రెండో దశలో 2027 ఫిబ్రవరిలో జనాభా, విద్య, ఉపాధి, కులానికి సంబంధించిన వివరాల సేకరణ పక్రియను పూర్తి చేయనున్నారు. జనగణనలో పౌరులు అందించే వ్యక్తిగత వివరాలకు చట్టపరమైన రక్షణ కల్పించారు. సెన్సస్‌ ‌యాక్ట్, 1948‌లోని సెక్షన్‌ 15 ‌ప్రకారం పౌరుల వ్యక్తిగత సమాచారానికి పూర్తి చట్టబద్ధ రహస్య రక్షణ ఉంటుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *