దేశంలో ప్రజాస్వామ్యం లేదా?

– దిల్లీలో కేంద్రం ఆంక్షలపై ప్రియాంకా గాంధీ ప్ర‌శ్న‌
– మోదీ, అమిత్ షా నేతృత్వంలో నియంతృత్వ పాలన సాగుతోంది

న్యూదిల్లీ, అక్టోబర్ 10 : ప్రధాన ఎన్నికల కమిషనర్ వైఖరి, వోటర్ల జాబితా సవరణలపై దిల్లీలో నిరసన తెలిపేందుకు వచ్చిన యువ తను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే కేం ద్ర ప్రభుత్వం నిరసనలను తీవ్రంగా అడ్డుకుం టోందని విమర్శించారు. రాజ్యాంగబద్ధ ప్రజా స్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడుతు న్నవారు దేశద్రోహానికి పాల్పడుతున్నట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో సీజేపీ తలపెట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ వ్యతిరేక నిరసనలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించడం, అనుమతి లేదంటూ యువతను ముందస్తుగా అదుపులోకి తీసుకో వడంపై ప్రియాంకా గాంధీ సామాజిక మాధ్య మం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. గతంలో 254 మంది ఎంపీలను ఇబ్బందులకు గురిచేసి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు, యువజన సంఘాల నిరసనకారు లపైనా అదే స్థాయిలో నిర్బంధం ప్రయోగిస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిల్లీ దిగ్బంధంపై మండిపాటు

దిల్లీ నగర సరిహద్దులను దిగ్బంధించి, రైళ్లు, మెట్రో సేవలను ఆపేసి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ అడుగడుగునా తనిఖీల పేరిట సాధారణ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రియాంక ఆరోపించారు. రాజ్యాం గం కల్పించిన ప్రాథమిక నిరసన హక్కును వినియోగించుకుంటున్న యువతపై దాడులు చేసి అరెస్టు చేయడం దారుణమన్నారు. ఎన్నికల సంఘం సహకారంతో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజా స్వామ్య సూత్రాలు అమలు కావడం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో స్పష్టమైన నియంతృత్వ పాలన సాగుతోందని ఆరోపించారు.

వోటు హక్కును బలహీనపరిచే యత్నం: జైరామ్ రమేష్

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ కూడా ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తున్న యువతను చూసి కేంద్ర ప్రభుత్వం తీవ్ర భయాందోళనకు గురవుతోందని, అందుకే దిల్లీని ఒక కోటలా మార్చేశారని అన్నారు. రాజ్యాంగంలోని 326వ అధికరణం పౌరులకు కల్పించిన పవిత్రమైన ఓటు హక్కును, రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయ‌న‌ విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *