తెలంగాణ బిసి వెల్ఫేర్ స్కూల్స్ జాయింట్ సెక్రటరీ శ్యామ్ ప్రసాద్ లాల్
కరీనగర్, ప్రజాతంత్ర నవంబర్ 24: సమాజాన్ని సక్రమ మార్గంలో పెట్టే విజ్ఞత కవులకే ఉంటుందని, వారే సమాజ నిర్దేశకులని తెలంగాణ బిసి వెల్ఫేర్ స్కూల్స్ సంయుక్త సంచాలకులు జి.వి శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. కవిసాయంత్రం సోషల్ మీడియా గ్రూప్ ఆత్మీయ సమ్మేళనం స్థానిక వివేకానంద పాఠశాలలో ఆదివారం జరిగిన కవుల ఆత్మీయ సమ్మేళనంలో శ్యాం ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కవి సాయంత్రం ద్వారా సోషల్ మీడియాలో పరిపుష్టమైన కవిత్వాన్ని అందిస్తున్నారని అన్నారు. ఇందులోని కవులు ప్రౌఢ సాహిత్యాన్ని అందిస్తున్నారని అన్నారు. కవి సాయంత్రం ద్వారా ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని ప్రశంసించారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా ఇంత మంచి బృహత్కార్యాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సాహితీమూర్తులకు తన వంతుగా ఏదైనా సహకారం అందిస్తారని అన్నారు. అనంతరం కవులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు అన్నవరం దేవేందర్, నంది శ్రీనివాస్, ఉద్యమ గాయని వొల్లాల వాణి, సంస్థ వ్యవస్థాపకులు ముక్కెర సంపత్ కుమార్, వివేకానంద పాఠశాలల చైర్మన్ సౌగాని కొమురయ్య, కవులు దేవర కనకయ్య, ఎడెల్లి రాములు, మధు మురళి, కవిత భేతి, డాక్టర్ మాలతీలత, నలంద దాస్ తదితరులు పాల్గొన్నారు