ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌దే విజయం

– కులమతాల పిచ్చి రేపుతోన్న బీజేపీ
– పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్‌లో పార్టీ నూతన కార్యాలయ భవనానికి మహేష్ గౌడ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దనసరి అనసూయ సీతక్క భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రధాని పదవిని కూడా రాహుల్ గాంధీ త్యాగం చేశారని, దేశం మొత్తం ఆయన వైపు చూస్తోందని అన్నారు. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ.. కుల, మతాల చిచ్చు రేపుతోందని మహేశ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు రావటం ఖాయమన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలన తెలంగాణను 50 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లిందని మహేశ్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో పార్టీ పోటీ లేదన్నారు. మంచి నమూనాతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎంతో అభివృద్ధి చేసిందని.. ఏడాది కాలంలో నలుగు లక్షల ఇండ్లు కట్టించి ఇచ్చామని మంత్రి సీతక్క వెల్లడించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *