అన్నపై కోపంతో తండ్రిని తిడితే ఎలా?

– తండ్రికి విలువ ఇవ్వని కవిత అమ్మ ఎలా అవుతుంది
– ఎంతయినా కేసీఆర్ ఉద్యమకారుడు
– ఆయన లేకుంటే కవిత ఎక్కడ ఉండేది
– తనకు పదవి ఇస్తే మరింత బాగా పనిచేస్తా
– మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సేన(టీఆరఎస్) అధ్యక్షురాలు కవితను ఉద్దేశించి ప్రశ్నించారు. తన అన్నపై ఉన్న కోపాన్ని తండ్రిపై చూపడం తప్పు అని అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిగిన కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు, రాజకీయ చర్యలపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కవిత పార్టీ ఏర్పాటు విషయాన్ని బిగ్ జోక్‌గా అభివర్ణించారు. అలాగే టీఆరఎస్ పేరుతో పార్టీ పెట్టడం మరో జోక్ అని వ్యాఖ్యానించారు. కూతురికి తండ్రి అంటే ప్రేమ ఉండాలి.. కానీ కవిత తన మొదటి సమావేశంలోనే తండ్రిని తిట్టి మర్యాద పోగొట్టుకున్నారని అన్నారు. తండ్రిపై గౌరవం, ప్రేమ ఉండాలని, అలాంటి విలువలు లేకపోతే ఆమె వ్యక్తిత్వం ప్రశ్నార్థకమవుతుందని అన్నారు. కుటుంబ సమస్యలను రాజకీయ వేదికపైకి తీసుకురావడం సరైన పద్ధతి కాదని ఆయన సూచించారు. ఉద్యమకారుడు కేసీఆర్‌ను తిట్టడం తనకు బాధ కలిగిందన్నారు. తనంతట తాను పోటీ చేసినా కవితకు డిపాజిట్ కూడా రాదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మద్యం కుంభకోణంలో ఆమెక” ఇంకా క్లీన్ చిట్ రాలేదని, కేసు పూర్తి కాలేదని తెలిపారు. డబ్బులు ఉన్నాయని పార్టీ పెట్టడమంటే పాన్ షాప్ పెట్టేంత సులువైందని వ్యాఖ్యానించారు. కాగా, తన రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడుతూ మంత్రి పదవిపై అధిష్ఠానం తనకు హామీ ఇచ్చిందని, మాట నిలబెట్టుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలిపారు. మంత్రి పదవి ఇస్తే మరింత కష్టపడి పనిచేస్తానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *