మొహర్రం ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలి

– అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
– మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : మొహర్రం సందర్భంగా నిర్వహించే చరిత్రాత్మక బీబీ-కా-ఆలం ఊరేగింపుతోపాటు ఇతర ఏర్పాట్లపై ఎంటర్‌ప్రెన్యూర్, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ శుక్రవారం సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీటి సదుపాయం, వైద్య సేవలు, రవాణా, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఊరేగింపుల సందర్భంగా భక్తుల భద్రత కోసం తగిన భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే భక్తులు, సాధారణ ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు తగిన సంఖ్యలో బస్సులను నడపాలని సూచించారు. బీబీ-కా-ఆలం ఊరేగింపులో పాల్గొనే సంప్రదాయ ఏనుగు ఏర్పాట్లపై కూడా మంత్రి సమీక్షించి అవసరమైన అన్ని అనుమతులు, ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆశూర్‌ఖానాలు, సబీళ్లలో మరమ్మతులు, నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు వక్ఫ్ బోర్డు అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గత సమీక్షా సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చేసిన సూచనలు, విజ్ఞప్తులను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిశీలించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది మొహర్రం ఏర్పాట్లు మరింత మెరుగ్గా ఉండేలా సమర్థవంతమైన ప్రణాళిక, బలమైన సమన్వయం, పనుల సకాల అమలుపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. సమాజ పెద్దలు, మత గురువులు, ఆశూర్‌ఖానా కమిటీలు, నిర్వాహకులతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తూ స్థానిక అవసరాలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, జీహెచఎంసీ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు, టీజీఎస్‌పీడీసీఎల్ చైర్మన్ అండ్ ఎండీ, హెచఎండబ్ల్యూఎసఎస్‌బీ మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎసఆర్‌టీసీ వైస్ చైర్మన్ అండ్ ఎండీ, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్లు, వక్ఫ్ బోర్డు సీఈవో, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *