– గోదావరిలో వరద పోతుంటే బురద రాజకీయాలా?
– రైతుల ఆవేదన కనిపించడం లేదా
– నీళ్లు లేక సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నడవని పరిస్థితి
– ఎల్‌నినోను కారణంగా చూపి బాధ్యత నుంచి తప్పించుకోవద్దు
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: ఒకవైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు గోదావరిలో భారీ వరద ప్రవాహం ఉన్నా, ఆ నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపడంలో మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఆందోళన కలిగిస్తోందంటూ మాజీ మంత్రి హరీష్రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి లేఖ రాశారు. నీళ్లు అందక పంటలు ఎండిపోతుంటే మీరు మాత్రం ప్రాజెక్టుల మీద రాజకీయాలు చేస్తూ, గోదావరి జలాలను లిఫ్ట్ చేయకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు
ఒకవైపు గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతుంటే, మరోవైపు అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీలో ఉన్నాయి. మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 13 టీఎంసీలు మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ 50 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం అందుబాటులో ఉంది. మల్లన్న సాగర్ నిండుకుండలా మారితే హైదరాబాద్ తాగునీటి అవసరాలతోపాటు మీరు చెబుతున్న మూసీ ప్రాజెక్టుకు కూడా ఇక్కడి నుంచి నీటిని తరలించే అవకాశం ఉంటుంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోనూ 15 టీఎంసీలకు కేవలం 6 టీఎంసీలే ఉన్నాయి. ఇక్కడికి సైతం నీటిని ఎత్తిపోస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. ఎల్లంపల్లిలో నీటి ఎత్తిపోతలు ప్రారంభిస్తే మిడ్ మానేరు సహా అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లకు నీటిని తరలించడంతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా పూర్తి పరిష్కారం లభిస్తుంది. ఈ రిజర్వాయర్లను నింపడం వల్ల దాదాపు 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణానికి దోహదం చేసినట్లవుతుందన్నారు. మరోవైపు మిడ్ మానేరు దిగువన ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండి)లో ప్రస్తుతం 11 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడికి నీటిని తరలిస్తే కరీంనగర్, వరంగల్ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయి. పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాల్లోని రైతులు, ప్రజలకు ఎంతో మేలు చేసిన వారవుతారు.
సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్వహణ కోసం రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే రంగనాయక సాగర్‌లో నీళ్లు లేకపోవడం వల్ల ఫ్యాక్టరీ నిర్వహణ ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితితో పామ్ ఆయిల్ సాగు చేస్తున్న రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి కోసం రైతులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తుంటే మీరు మాత్రం నదుల్లో వస్తున్న నీళ్లను లిఫ్ట్ చేయకుండా కిందకు వదిలిపెడుతున్నారు అని విమర్శించారు.
ప్రస్తుతం గోదావరిలో ఎల్లంపల్లి వద్ద వరద ప్రవాహం భారీగా కొనసాగుతున్నది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని అన్ని మోటార్లను నడిపి నీళ్ళు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్దేశపూర్వకంగా మీరు చేస్తున్న నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతున్నది. జలకళతో కనిపించాల్సిన రిజర్వాయర్లు ఎండిపోయి కనిపిస్తున్నాయంటే దానికి కారణం నీటి నిర్వహణలో మీ ప్రభుత్వ వైఫల్యం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు.. ఎల్‌నినోను సాకుగా చూపకుండా అందివచ్చిన గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకునేలా ఆన్-ఆఫ్ పద్ధతిలో కాక 24 గంటల పాటు అన్ని మోటార్లు నడిపి జలాశయాలను నింపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి రైతు ప్రయోజనాల కోసం ఆలోచించాలని, ప్రకృతిపై నెపం నెట్టి రైతులకు సాగు నీళ్లు ఇచ్చే బాధ్యత నుంచి తప్పించుకోవద్దని హరీష్‌రావు హితవు పలికారు.

———————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు