ఆసియా క్రీడల షూటింగ్‌లో గోల్డ్ మెడల్

దిల్లీ, సెప్టెంబర్ 25 : ఆసియా క్రీడల షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ దక్కింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు కమల్‌జీత్, సురుచి సింగ్ స్వర్ణం సాధించారు. దీంతో ఈ క్రీడల్లో మన దేశానికి రెండో పసిడి పతకం లభించింది. అంతకుముందు మహిళల క్రికెట్ జట్టు బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు జోడీలు ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇందులో కమల్‌జీత్, సురుచి కలిసి మొత్తంగా 484.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఇక, దక్షిణ కొరియా ద్వయానికి రజతం, ఇరాన్ జోడీకి కాంస్యం దక్కాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత త్రయం రజతం సాధించింది. ఫైనల్‌లో మన షూటర్లు ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంశ్ పాటిల్, నీరజ్ కుమార్ మొత్తంగా 1762 పాయింట్లు సాధించారు. 1766 పాయింట్లతో చైనా టీమ్ స్వర్ణం నెగ్గింది. మరోవైపు స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో జోష్న చిన్నప్ప, సెంధిల్ కుమార్ పతకం ఖాయం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఫిలిప్పీన్స్ జోడీ డేవిడ్ పెలినో-జెమైకా అరిబాడోను 11-3, 11-5తో ఓడించి మన ఆటగాళ్లు సెమీస్‌కు దూసుకెళ్లారు. దీంతో కనీసం కాంస్యం ఖాయం చేసుకున్నారు. అటు టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో భారత ద్వయం మనుష్ షా, దియా చితాలే కూడా పతకం ఖాయం చేసుకున్నారు. క్వార్టర్స్‌లో వీరు హాంగ్‌కాంగ్ జోడీని ఓడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *