– ఓల్డ్ సిటీ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు
– పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి రక్ష అని విశ్వసించి కాంగ్రెస్, బీఆరఎస్‌లను వీడి బీజేపీలో చేరుతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్, బీఆరఎస్‌లకు ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపే చూస్తున్నారని అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాత బస్తీకి చెందిన పలువురు ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, యువత భారీ సంఖ్యలో పార్టీలో గురువారం చేరారు. వారందరికీ రామచందర్‌రావు కాషాయ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జాంబాగ్ డివిజన్‌కు చెందిన శ్రీనివాస్ యాదవ్, బీఆరఎస్ నుంచి వచ్చిన భాస్కర్, రాజ్‌పుత్ సమాజ్ ప్రతినిధులతోపాటు ఆదిత్య, బాలపరమేష్, ధరమ్ కుమార్, అమర్నాథ్, ప్రేమ్ కుమార్, గణేష్, పవన్ కుమార్, మహేశ్, బాలాజీ, మంగీలాల్, రూపేష్, హరీష్, మహేందర్, విక్రమ్, రాజేష్, రమేష్ ముదిరాజ్, సాయిబాబా, నరేష్, రాజు, బాలరాజు, రాహుల్, కార్తీక్, నవీన్ తదితరులు సంతోష్ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ య్రువతకు, నాయకులకు మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి అండ్ మీడియా ఇన్చార్జి ఎన్.వి.సుభాష్, రాష్ట్ర అధికార ప్రతినిధి సందీప్ సాయి, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





