7, 8, 9 తేదీల్లో సీఎం కొడంగల్ పర్యటన

– రూ.9,100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
– రైతు మేలా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో ప్రారంభం
– రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎస్‌హెచ్‌జీ మహిళలతో సమావేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈనెల 7, 8, 9 తేదీల్లో కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మెగా రైతు మేలా ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభించడంతోపాటు రూ.9,100 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. పూర్తయిన భవనాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట చేరుకుంటారు. 11.10 గంటలకు అక్కడ మెగా రైతు మేలా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభిస్తారు. 12 గంటల వరకు ప్రదర్శన స్టాల్స్‌ను సందర్శిస్తారు. ఒంటి గంట వరకు ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. 2 గంటల వరకు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. 3 గంటలకు హకీంపేట నుంచి రోడ్డు మార్గంలో కొడంగల్ నివాసానికి బయలుదేరుతారు. రాత్రి కొడంగల్‌లో బస చేస్తారు. 8వ తేదీ ఉదయం 9.15 గంటలకు కొడంగల్ నివాసం నుంచి బయలుదేరి హకీంపేట చేరుకుంటారు. 9.30 నుంచి 10.20 గంటల వరకు స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమవుతారు. 10.20కు పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. తర్వాత లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన, 10.45కు హకీంపేటలో రూ.4 కోట్లతో నాట్కో సంస్థ సీఎసఆర్ నిధులతో నిర్మించిన జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. 11 గంటలకు రూ.2.35 కోట్లతో నిర్మించిన హకీంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 11.30కు బొంరాస్‌పేటలో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను, రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15కు కొడంగల్‌లో రూ.3.80 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత దుద్యాలలో రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను, 1.15కు రూ.12 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. 1.40కు కోస్గి మండలం నాచారంలో రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కొత్వాల్‌గూడ నుంచి నాచారం వద్ద జాతీయ రహదారి 167ఎన్ వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్డు-2కు శంకుస్థాపన చేస్తారు. 2 గంటలకు కోస్గిలో రూ.6 కోట్లతో నిర్మించిన సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. 2.45కు దౌల్తాబాద్ మండలం బాలంపేటలో రూ.2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, 3.30కు రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభిస్తారు. అనంతరం కొడంగల్ నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కొడంగల్ నివాసం నుంచి హకీంపేటకు బయలుదేరుతారు. రాత్రి 7 గంటల వరకు అక్కడ నిర్వహించే భారీ రైతు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

రూ.9,053 కోట్లతో 13 అభివృద్ధి పనులు

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మొత్తం రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో కొత్తవాల్‌గూడ నుంచి నాచారం వరకు రూ.5,060 కోట్లతో రేడియల్ రోడ్డు-2, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల పనులు, రూ.2,100 కోట్లతో ఎంఎన్‌కేఎలఐఎస్ రెండో దశ పనులు ఉన్నాయి. విద్యా రంగంలో రూ.118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, రూ.123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి సంబంధించిన పనులు ఉన్నాయి.
రూ.41.83 కోట్లతో కొడంగల్, కోస్గి, మద్దూరులో ఆధునిక బస్ స్టాండ్లు, రూ.20 కోట్లతో మద్దూరులో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, రూ.20 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం, రూ.59.30 కోట్లతో రహదారుల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. తిమ్మారెడ్డిపల్లిలో గురులోక మసంద్ ప్రభు మందిరం అభివృద్ధికి రూ.4.45 కోట్లు, కొడంగల్‌లో నిరంజన్ మఠం అభివృద్ధికి రూ.5.10 కోట్లు కేటాయించారు. హకీంపేట ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.10 కోట్లతో పర్యాటక హోటల్ నిర్మాణం, రూ.81 కోట్లతో ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారు. రూ.46.08 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 10 ప్రభుత్వ భవనాలను ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *