కొత్త పెన్షన్లపై మంత్రి కీలక ఆదేశాలు

– దసరాకు ముందే అర్హులకు అందించాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో కొత్త పెన్షన్లపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్‌లో కొత్త పెన్షన్ల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దసరా పండుగకు ముందే అర్హులైన వారికి కొత్త పెన్షన్లు అందేలా చూడాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు ఒంటరి మహిళలు, వితంతువులకు పూర్తి స్థాయిలో పెన్షన్లు అందజేయాలని మంత్రి సూచించారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ పెన్షన్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *