తెలంగాణ సిటిజన్స్ వాచ్ ఆవిర్భావం

– పౌరసమస్యలు వెలుగులోకి తెచ్చే స్వతంత్ర పౌర వేదిక

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా, సామాజిక, పౌర సమస్యలను బాధ్యతాయుతంగా వెలుగులోకి తీసుకురావడానికి తెలంగాణ సిటిజన్స్ వాచ్ అనే స్వతంత్ర పౌరవేదికను ప్రారంభించినట్టు సంస్థకు నేతృత్వం వహిస్తున్న ఇప్ప పృథ్వి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం చిన్న బృందంగా ప్రారంభమైన ఈ వేదిక, ప్రజల సమస్యలకు సంబంధించిన సమాచారం , ఫోటోలు, వీడియోలు, పత్రాలు ఇతర ఆధారాలను స్వీకరించి సాధ్యమైనంత వరకు పరిశీలించి అవసరమైన సందర్భాల్లో సంబంధిత అధికారులు, సంస్థలు, ప్రజాప్రతినిధుల దృష్టికి చట్టబద్ధమైన మార్గాల ద్వారా తీసుకెళ్లడం లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. అయితే ఇది ప్రభుత్వ సంస్థ, పోలీస్ శాఖ, న్యాయస్థానం లేదా చట్టబద్ధమైన అధికార సంస్థ కాదని స్పష్టం చేశారు. కేవలం ప్రజా సమస్యలను బాధ్యతాయుతంగా నమోదు చేసి అవసరమైనప్పు డు సరైన అధికారిక మార్గాలకు చేరవేయడమే దీని ప్రధాన పాత్ర అని వివరించారు. సాధ్యమైన సందర్భాల్లో ఆధారాలను పరిశీలించడం, సమాచారాన్ని క్రాస్-చెక్ చేయడం, సంబంధిత వ్యక్తులు లేదా సంస్థల వివరణ కోరడం, కొత్త విశ్వసనీయ సమాచారం లభించినప్పు డు సమాచారాన్ని సరిచేయడం లేదా నవీకరించడం వంటి విధానాలను అనుసరిస్తుందని వివరించారు. వేదికలో ఏదైనా అంశం ప్రచురించడం అనేది ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ దోషిగా తేలినట్లు భావించరాదని పేర్కొన్నారు. భవిష్యత్తులో గ్రామాలు,పట్టణాలు, మున్సిపాలిటీలు, నగరాల్లో పౌరులు, కార్యకర్తలు, స్వచ్ఛంద కార్యకర్తలతో కూడిన నెట్వర్క్ ను నిర్మించాలనుకుంటున్నది. పౌరులు, కార్యకర్తలు, వలంటీర్లు, జర్నలిస్టులు, పరిశోధకులు, టెక్నాలజీ, న్యాయనిపుణులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి ఆహ్వానిస్తున్నమన్నారు. తెలంగాణ సిటిజన్ వాచ్ రాష్ట్రంలో ప్రజా అవగాహన, బాధ్యతాయుతమైన పౌర రిపోర్టింగ్, ప్రజా జవాబుదారీతనం కోసం పనిచేసే స్వతంత్ర పౌర వేదిక. అత్య వసర పరిస్థితులు, తీవ్రమైన నేరాలు లేదా తక్షణ ప్రమాదం ఉన్న సందర్భా ల్లో ప్రజలు నేరు గా సంబంధిత అధికారు లను సంప్రదించాలి. ఈ సంస్థ అధికారిక చర్యలకు ప్రత్యామ్నాయం కాదు: కేవలం బాధ్యతాయు తమైన పౌర భాగస్వామ్యానికి అదనపు వేదిక మాత్రమేనన స్పష్టం చేశారు. ఆసక్తి వున్నవారు telanganacitizenwatch@gmail.comలో సంప్రదించవచ్చు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *