ఏసీబీకి చిక్కిన మెట్ పల్లి సీడీపీవో

– అంగన్ వాడీ కేంద్రాల నుంచి లంచం తీసుకుంటుండగా ..

ఇబ్రహీంపట్నం /మెట్పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: జగిత్యాల జిల్లా మెట్పల్లి సీడీపీఓ దారోజు పద్మ రూ.63 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శుక్రవారం కార్యాలయ ఆవరణ వెలుపల ఫిర్యాదుదారు నుంచి లంచం తీసుకుంటుండగా ఆదిలాబాద్ ఇన్చార్జి ఏసీబీ డీఎస్పీ గొర్రె మధు ఆధ్వర్యంలోని అధికారులు రెడ్ హ్యాం డెడ్గా పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ.63 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మెట్పల్లి మండల పరిధిలోని 21 అంగన్వాడీ కేంద్రాల నుంచి ఒక్కో కేంద్రానికి నెలకు రూ.1,000 చొప్పున మూడు నెలలకు రూ.3,000గా మొత్తం రూ.63 వేలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. అంగన్వాడీ కేంద్రాల తనిఖీల్లో ప్రతికూల అంశాలు నమోదు చేయకుండా ఉండేందుకు ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సీడీపీఓను అరెస్టు చేసి కరీంనగర్ లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదు దారుడి వివరాలను భద్రతా కారణాలతో గోప్యంగా ఉంచినట్లు వెల్లడిం చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అలాగే 9440446106 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా సమాచారం అందించవచ్చని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *