హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న కె.భరద్వాజ్ రెడ్డి(18) నిర్మాణంలో ఉన్న ఒక భవనంపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెడికో బలవన్మరణానికి గురికావడంతో ఆయన కుటుంబంలో, ఉస్మానియా మెడికల్ కాలేజీలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. భరద్వాజ్ రెడ్డి తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతం నుంచి కనిపించకుండాపోయాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా అతని ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. ఉదయం 8.30 గంటల సమయంలో స్థానికులు డయల్`100కు సమాచారం అందించడంతో ఉప్పల్ పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిర్మాణంలో ఉన్న భవనం కింద తీవ్ర గాయాలతో పడి ఉన్న భరద్వాజ్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, చదువుల ఒత్తిడి లేదా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



