మెడికల్ మాఫియా మాయాజాలం

– ల్యాబ్ పరీక్షలు, మందుల పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ
– గ్రామీణ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసి కమీషన్
– స్పందించని వైద్య, ఆరోగ్య శాఖ
– సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రజారోగ్య పరిరక్షణ సమితి ఏర్పాటు
– ప్రజల్లో చైతన్యం కోసం యత్నాలు

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సిరిసిల్ల, అక్టోబర్ 27: రాజన్న సిరిసిల్ల జిల్లా మరో ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఇటీవల పేద, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న ప్రైవేట్ మెడికల్ మాఫియా తీరుపై ప్ర జల్లో ఆందోళనకు దారితీస్తున్నట్లు కనిపి స్తుంది. అది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజారోగ్య పరిరక్షణ సమితి వేదిక నిర్మాణానికి పునాదులు వేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రజారోగ్య పరిరక్షణ వేదిక ఆవిర్భవించింది. ఇటీవల అడ్డగోలుగా ప్రైవేట్ హాస్పిటల్స్ పుట్టుకొస్తున్నాయి. కొన్ని దవాఖానలు పేదల ఆరోగ్యాలను ఫణంగా పెట్టి ధనార్జనే లక్ష్యంగా మెడికల్ మాఫియాగా రూపాంతరం చెం దాయనే ఆరోప‌ణ‌లున్నాయి. వైద్యాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చిన కొంతమంది చికిత్స కోసం వచ్చిన రోగులను వైద్య పరీక్షలు, మెడిసిన్స్ పేరుతో ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. రూ.20 విలువ చేసే ఐవీ సెట్ ను రూ.250కు విక్రయిస్తున్నారని, ప్రజలు అత్యధికం గా వినియోగించే సుమారు పది రకాల ఔషధాల విషయంలో అడ్డగోలుగా దోచేస్తున్నారని చెబుతున్నారు. తరచూ వినియోగించే ఔషధాల ధరలను జనరిక్ మందుల పేరుతో ఇష్టారాజ్యంగా పెంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండడంతో మెడికల్ మాఫియా అడ్డూ అదుపు లేకుండాపోతోంది. కేవలం ఔషధాల వి షయంలోనే కాకుండా, వైద్య పరీక్షల పేరుతోనూ మోసాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లు

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు రోగులు డబ్బులకు వెనుకాడకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ కు పరుగులు పెడుతుంటా రు. ఇదే నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని, వారి నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు పిండేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఏజెంట్లను నియమించుకొని రోగులను తమ హాస్పిటల్స్ కు రిఫర్ చేయిస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని సిరిసిల్లకు చెందిన ఓ పౌరుడు ‘ప్రజాతంత్ర’కు తెలిపారు. ఏజెంట్లకు ఆశ చూపి ప్రైవేట్ దవాఖానలకు తీసుకొచ్చే రోగుల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తూ ఆ దోపిడీలో కమీషన్ల పేరుతో పంపకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నియంత్రణ ఏది?

వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకున్న కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యశాఖ అధికారులు మెడికల్ మాఫియాకు అడ్డు కట్ట వేసి ప్రజలను కాపాడాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలో ప్రజారోగ్య పరిరక్షణ సమితి పేరుతో వేదిక ఏర్పాటు కావడం గమనార్హం.

ప్రజలే ఉద్యమించాలి : బుస్స వేణు, ప్రజారోగ్య పరిరక్షణ సమితి అధ్యక్షుడు 

ప్రజలే ముందుకు వచ్చి మెడికల్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలి. ఒక్క ఈ జిల్లాలోనే ఏడాదికి సుమారు రూ.150 నుంచి రూ.200 కోట్ల వ్యాపారం జరుగుతోందంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో ఆలోచించాలి. మొదటిసారి హాస్పిటల్ కు వెళ్లగానే ఓపీ ఫీజు రూ.500 వసూలు చేస్తున్నారు. ల్యాబ్ పరీక్షల పేరుతో మొదలయ్యే దోపిడీ ఇష్టా రాజ్యంగా కొనసాగుతోంది. మరోవైపు, తాము సూచించిన మందులే వాడాలం టూ అవసరం లేని మందులను కూడా అంటగడుతున్నారు. ఔషధాలపై ఉన్న గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రజలు స్వ చ్ఛందంగా ఉద్యమించాలి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *