– ప్రారంభించిన డీజీపీ ఆనంద్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 27: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా డీజీపీ కార్యాలయంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని డీజీపీ సి.వి.ఆనంద్ మంగళవారం ప్రారంభించారు. ఈనెల 21 నుంచి నిర్వహిస్తున్న ఈ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం నిరంతరం శ్రమించే పోలీసులు అత్యవసర సమయాల్లో రక్తదానం ద్వారా కూడా ప్రాణదాతలుగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా భద్రతతోపాటు ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం పోలీసుల సామాజిక బాధ్యతకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో డీజీ లా అండ్ ఆర్డర్ మహేశ్ భగవత్, ఏడీజీ అకున్ సబర్వాల్, మల్టీ జోన్-2 ఐజి షానవాజ్ ఖాసీం, రెడ్‌క్రాస్ సొసైటీ డైరెక్టర్ పిచ్చిరెడ్డితో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





