చిట్టీల పేరుతో భారీ మోసం

– రూ.2.5కోట్లతో ఉడాయించిన భార్యాభర్తలు
– అమీన్ పూర్ డివిజన్ లో ఘటన

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం లోని అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చిట్ఫండ్ మోసం వెలుగుచూసింది. చిట్టీల పేరిట స్థానికుల నుంచి రూ.2.5 కో ట్లకు పైగా వసూలు చేసిన భార్యాభర్తలు రాత్రికి రాత్రే పరారైన ఘటన కలకలం రేపు తోంది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సాంబశివరావు, శిరీష దంపతులు గత 20 ఏళ్లుగా అమీన్పూర్ లోని బీఎస్ఆర్ కాలనీలో స్థానికులతో పరిచయాలు పెంచుకున్నారు. వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ప్రతీ నెల చిట్టీలు నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో నగదు సేకరించారు. కొన్నేళ్లపాటు చిట్టీలను సక్రమంగా నిర్వహించడంతో స్థానికులతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా లక్షల్లో డబ్బులను వీరి వద్ద పెట్టుబడిగా పెట్టారు. ఇటీవల చిట్టీల గడువు ముగిసినా కూడా సభ్యులకు డబ్బులు చెల్లించ కుండా సాంబశివరావు దంపతులు దాటవేశారు. ఈ క్రమంలోనే ఎవరికీ తెలియకుండా తమ సొంత ఇంటిని రూ. కోటి 60 లక్షలకు అమ్మేసి ఇల్లు ఖాలీ చేసి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని పరారైనట్లు తెలిసింది. బాధితులు వారి ఇంటికి వెళ్లి చూడగా ఇల్లు ఖాళీగా ఉండటంతో మోసపోయామని గ్రహించారు. తమ కష్టార్జితమైన రూ.2.5 కోట్లకు పైగా నగదు చిక్కుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 మందికి పైగా బాధితులు కలిసి అమీన్ పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రా రంభించారు. ఈ దంపతుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *