జ్యోతి బాపూలే కళాశాల విద్యార్థి ఆత్మహత్య

– ఉపాధ్యాయులే కారణమంటూ విద్యార్థుల ఆందోళన

నాగర్ కర్నూల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య పట్ల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. విద్యార్థి మృతికి ఉపా ధ్యాయులే కారణమంటూ విద్యార్థులు స్తారోకో నిర్వహించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీపురం గ్రామ శివారు మహాత్మా జ్యోతిబాపూలే కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి భరత్ స్వగ్రామంలోని ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 12న స్వగ్రామానికి వెళ్లిన విద్యార్థి 15న కళాశాలకు తిరిగి రాకపోవడంతో కళాశాల సిబ్బంది ఫోన్ చేసి విషయాన్ని కనుగొన్నారు. అయితే తాను కళాశాలకు వెళ్లబోనని తల్లికి చెప్పడంతో వారు సరేనన్నారు. అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో భరత్ ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు.శుక్రవారం భరత్ తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి విద్యార్థి వస్తువులు తీసుకెళ్లేందుకు రాగా భరత్ చనిపోయిన విషయం తెలియడంతో తోటి విద్యార్థులు అవాక్కయ్యారు. ఉపాధ్యాయు లు వేధింపులకు గురిచేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి శ్రీపురం చౌరస్తాలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *